HomeఫోటోలుEPIC - First Semester | మూవీ తొలి గీతం 'సంచారమే' విడుదల

EPIC – First Semester | మూవీ తొలి గీతం ‘సంచారమే’ విడుదల

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ సినిమా నుంచి తొలి గీతంగా ‘సంచారమే’ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మనోహరమైన పాట ప్రధాన పాత్రల భావోద్వేగ ప్రయాణాన్ని ఎంతో అందంగా ఆవిష్కరించింది.

Sancharame First Single From EPIC First Semester2

ప్రఖ్యాత గీత రచయిత గోరేటి వెంకన్న రచించిన ఈ పాట స్వచ్ఛమైన తెలుగు కవిత్వంతో పాటు హృదయాన్ని తాకే భావాలతో ప్రత్యేకంగా నిలుస్తోంది. దేశీ మూలాలు, విదేశీ జీవితానికి మధ్య ఉన్న విరుద్ధ భావాలను సున్నితంగా ప్రతిబింబిస్తూ సినిమా కథనానికి అనుగుణంగా ఈ పాట సాగుతుంది. ఈ గీతానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు. ఆ కూర్పుకు మరింత గాఢతను జోడిస్తూ హేషమ్ అబ్దుల్ వహాబ్, గోరేటి వెంకన్న కలిసి శ్రావ్యంగా పాటను ఆలపించారు.

- Advertisement -
Sancharame First Single From EPIC First Semester3

దృశ్యపరంగా ఈ పాట లండన్ యొక్క అద్భుతమైన దృశ్యాలను ప్రదర్శిస్తుంది. అంతర్జాతీయ ప్రకృతి దృశ్యాలను, తెలుగు స్వరాల మాధుర్యాన్ని మిళితం చేస్తూ ఎంతో ఆకర్షణీయంగా ఈ గీతముంది. బ్లాక్‌బస్టర్ “బేబీ” తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడి తెరపై ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

Sancharame First Single From EPIC First Semester1

’90s’ వెబ్ సిరీస్ తో అందరి మనసులు దోచుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్, ఈ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా అద్భుతమైన తారాగణం, ప్రతిభగల సాంకేతిక బృందాన్ని ఒకచోట చేర్చింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. వెంకట్ ఉప్పుటూరి, వి.ఎం.ఆర్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Sancharame First Single From EPIC First Semester5

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ను భావోద్వేగాలతో కూడిన మృదువైన ప్రేమకథగా నిర్మాతలు అభివర్ణించారు. యువ హృదయాల అమాయకత్వం, సంఘర్షణలు, మౌన భావాలను ప్రతిబింబించే సరికొత్త, మధురమైన ప్రేమకథకు ఈ చిత్రం హామీ ఇస్తుంది.

ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య
రచన, దర్శకత్వం: ఆదిత్య హాసన్
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
ఛాయాగ్రహణం: అజీమ్ మహమ్మద్
కూర్పు: నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఫణి కె వర్మ
సహ నిర్మాతలు: వెంకట్ ఉప్పుటూరి, వీఎంఆర్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
నిర్మాణ సంస్థలు: సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

- Advertisement -
RELATED ARTICLES

Latest News