ది ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో 300 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (Administrative Officer) ఉద్యోగాల నియామకానికి ప్రకటన (Notification) విడుదలైంది. ఇందులో 285 జనరలిస్ట్(Generalist), 15 హిందీ ఆఫీసర్స్ (Hindi Officers) స్కేల్-1 (బ్యాక్‌లాగ్‌లతో కలిపి) ఉన్నాయి. సవివరమైన ప్రకటన డిసెంబర్ 1 సాయంత్రం ఆరున్నర తర్వాత నుంచి www.orientalinsurance.org.in/careersలో అందుబాటులో ఉంటుంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కూడా ఆ రోజు నుంచి డిసెంబర్ 15 వరకు చేసుకోవచ్చు. రెండు దశల్లో రాత పరీక్ష (Written Exam), ఇంటర్వ్యూ (Interview) అనంతరం ఎంపిక చేస్తారు. మొదటి దశ పరీక్ష జనవరి 10న, రెండో దశ పరీక్ష ఫిబ్రవరి 28న నిర్వహించే అవకాశం ఉంది. ఇంటర్వ్యూ తేదీలను తర్వాత ప్రకటిస్తారు.
Oriental Insurance Company | 300 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు
By Aadab Desk
- Advertisement -
Previous article

