Thursday, March 26, 2026
Homeకెరీర్ న్యూస్TG EAPCET 2026 | టీజీ ఎప్ సెట్ కు దరఖాస్తుల వెల్లువ..

TG EAPCET 2026 | టీజీ ఎప్ సెట్ కు దరఖాస్తుల వెల్లువ..

  • ఇప్పటి వరకు దాదాపు 2,20,879 దరఖాస్తులు..

ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్‌సెట్‌కు దరఖాస్తులు ఊపందుకున్నాయి. ఇంటర్‌ వార్షిక పరీక్షలు ముగియడంతో దరఖాస్తులు జోరందుకున్నాయి. సోమవారం వరకు 2,20,879 మంది దరఖాస్తు చేసుకున్నారు.తెలంగాణ పర్యాటకం

విభాగాలవారీగా తీసుకొంటే ఇంజినీరింగ్‌కు 1,55,804మంది, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ విభాగానికి 64,866, రెండు పేపర్లకు హాజరయ్యేందుకు 209 మంది దరఖాస్తు చేసుకున్నట్టు ఎప్‌సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 13వరకు 1.3లక్షల దరఖాస్తులు రాగా, ఇప్పటివరకు 2.20 లక్షల దరఖాస్తులు వచ్చాయి. పదిరోజుల్లో 90వేలకుపైగా దరఖాస్తులు వచ్చా యి. ఏప్రిల్‌ 4తో గడువు ముగియనున్నది. ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసే అవకాశమున్నది. మే 4 నుంచి 11 వరకు ఎప్‌సెట్‌ నిర్వహించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News