Wednesday, January 14, 2026
EPAPER
HomeUncategorizedKCR | కెసిఆర్ దీక్షా వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు.

KCR | కెసిఆర్ దీక్షా వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు.

  • మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి..

డిసెంబర్ 9 న కెసిఆర్ చేపట్టిన దీక్షా వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని, డిసెంబర్ 9 నీ విజయ దివాస్ అని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ .. కెసిఆర్ సచ్చోడో తెలంగాణ వచ్చాడో అంటూ నవంబర్ 29 నుండి డిసెంబర్ 9 వరకు చేసిన ఆమరణ దీక్షతో కేంద్రం తెలంగాణ ప్రకటన చేసిందని కెసిఆర్ రణబేరీ, ఆత్మార్పణకు సంకల్పించిన రోజు కాబట్టి డిసెంబర్ 9 నీ విజయ దివాస్ గా జరుపుకుంటున్నామని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ఆంధ్రకు తాకట్టు పెట్టేవిధంగా రేవంత్ రెడ్డి పాలన ఉన్నదని, కెసిఆర్ ఆమరణ దీక్ష, అమరవీరుల త్యాగాల వల్ల వచ్చిన రాష్టం నేడు తిరోగమన దశలో ఉందని, భావితరాలకు ప్రమాదకరం అని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో సుపరిపాలన కావాలంటే మళ్ళీ కెసిఆర్ సర్కార్ రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమములో అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, పట్టణ అధ్యక్షులు రమేష్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, పట్టణ కార్యదర్శి గంధం పరంజ్యోతి, మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News