తెలంగాణ(Telangana) రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల (Gram Panchayat elections) షెడ్యూల్ (Schedule) విడుదలైంది. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. డిసెంబర్ 11న మొదటి దశ పోలింగ్ (polling), 14న రెండో దశ, 17న మూడో దశ పోలింగ్ ఉంటుంది. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ (Voting) నిర్వహిస్తారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు (Counting) ప్రారంభిస్తారు. సర్పంచ్, వార్డు సభ్యుల కోసం మాత్రమే ఎన్నికలు జరుగుతాయి.
నోటిఫికేషన్ వెలువడటంతో కోడ్ అమల్లోకి వచ్చింది. మొదటి దశ నామినేషన్ నవంబర్ 27 నుంచి, రెండో దశ నామినేషన్ నవంబర్ 30 నుంచి, మూడో విడత నామినేషన్ డిసెంబర్ 3 నుంచి మొదలవుతుంది. ఎన్నికల ప్రకటనను రాష్ట్ర ఎన్నికల అధికారి రాణీ కుముదిని లాంఛనంగా విడుదల చేశారు. ఓట్ల లెక్కింపు పూర్తైన వెంటనే వివాదాలు ఏమీ లేకపోతే ఫలితాలు ప్రకటిస్తారు. ఫలితాలకు సంబంధించి ఫిర్యాదులు ఉంటే ఎన్నికల అధికారులకు లిఖిత పూర్వకంగా తెలియచేసే అవకాశం ఉంటుంది.

