- ప్రభుత్వం, ఈసీని ప్రశ్నించిన హైకోర్టు
- స్థానిక ఎన్నికలపై హైకోర్టులో విచారణ
- రెండు వారాల సమయం కోరిన అధికారులు..
- బీసీ రిజర్వేషన్ల సమస్య వల్లే నోటిఫికేషన్ నిలిపివేశామని కోర్టుకు తెలిపిన ఈసీ
- 2 వారాలకు వాయిదా వేసిన న్యాయస్థానం
తెలంగాణ స్థానిక ఎన్నికల నిర్వహణపై కీలక పరిణామాలు చూటుచేసుకుంటున్నాయి. తాజాగా హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. స్థానిక ఎన్నికలపై రీనోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని పిటిషన్లో దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఈసీ నోటిఫికేషన్ ను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ న్యాయవాది సురేందర్ పిటిషన్ వేశారు. దీనిపై ఇవాళ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. వాదనలు విన్న హైకోర్టు.. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ ను ప్రశ్నించింది. ఎన్నికలు నిర్వహణపై సమాధానం చెప్పేందుకు రెండు వారాల సమయం ఇవ్వాలని న్యాయస్థానాన్ని ప్రభుత్వం, ఈసీ కోరింది.
దీంతో హైకోర్టు ఇందుకు అంగీకరించి రెండు వరాల సమయం ఇచ్చింది. అనంతరం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. విచారణ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ ను హైకోర్టు ప్రశ్నించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచూ ప్రభుత్వం జారీచేసిన జీవోను హోకోర్టు కొట్టివేడంతో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ సస్పెండ్ చేస్తూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈ నెల 9 న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే నోటిఫికేషన్ను సస్పెండ్ చేయడానికి సవాలు చేస్తూ సురేందర్ అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ జీవో ప్రకారమే ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే హైకోర్టు ఆ జీవోపై స్టే విధించింది.
దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టకుండానే అత్యున్నత న్యాయస్థానం సైతం రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ను కొట్టివేయడంతో రిజర్వేషన్ల పంచాయితీ అగమ్యగోచరంగా మారింది. దీనితో స్థానిక ఎన్నికల పక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. అటు ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ రాకపోతే పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. గురువారం సుప్రీంకోర్టు కూడా ఎన్నికలకు వెళ్లమని చెప్పింది కదా అంటూ వ్యాఖ్యానించింది.
ఎన్నికలు పెట్టుకోవచ్చని ఓరల్గా మాత్రమే చెప్పిందని.. ఆర్డర్లో ఎక్కడా చెప్పలేదని ఎలక్షన్ కమిషన్ తరఫు న్యాయవాది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాశామని కోర్టుకు తెలిపారు. బీసీ రిజర్వేషన్లలను 42 శాతానికి పెంచుతూ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాం కాబట్టే దాన్ని సస్పెండ్ చేశాం. మళ్లీ రిజర్వేషన్లను గూర్చి ప్రభుత్వంతో చర్చించాకే రీ నోటిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు. రెండు వారాల సమయం కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం కోర్టును కోరడంతో తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.
