HomeసినిమాParvathagiri | మొక్కజొన్న పంటలో తెగుళ్లు…

Parvathagiri | మొక్కజొన్న పంటలో తెగుళ్లు…

  • పర్వతగిరి రైతుల ఆవేదన.

వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో మొక్కజొన్న పంటకు తెగుళ్లు సోకడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న చేయితికొచ్చే సమయంలోనే పంటకు తెగుళ్లు ఏర్పడి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట సాగులో పెట్టుబడులు పెరిగిన ఈ సమయంలో పంట నాశనం కావడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నామని తెలిపారు.

Pest Infestation In Corn Crop Parvatagiri Warangal District

వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే పొలాలను పరిశీలించి తెగుళ్ల నివారణకు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు రైతులకు సరైన సూచనలు ఇవ్వాలని కోరుతున్నారు. అధికారులు త్వరితగతిన స్పందించి రైతులకు సహాయం చేయాలని మండలంలోని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News