Friday, March 13, 2026
Homeనల్లగొండSSC Exams | పాత పద్ధతిలోనే 10వ తరగతి పరీక్షలు

SSC Exams | పాత పద్ధతిలోనే 10వ తరగతి పరీక్షలు

  • రేపు ప్రారంభమై ఏప్రిల్ 16 వరకు జరుగును.

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా జవాబు పత్రానికి (ఆన్సర్ బుక్ లెట్) ఓఎంఆర్ షీట్‌ను జత చేసే విధానాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ వెల్లడించారు.విద్యార్థులు సమాధాన పత్రంతో పాటు ఉన్న ఓఎంఆర్ షీట్‌ను తప్పనిసరిగా ఉపయోగించాల్సి ఉంటుంది.మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు.

విద్యార్థులు పరీక్షా విధానంపై అవగాహన పెంచుకోవడానికి వీలుగా ఓఎంఆర్ షీట్,జవాబు పత్రం యొక్క నమూనా కాపీలను వెబ్‌సైట్‌లో ఉంచారు.విద్యార్థులు www.bse.telangana.gov.in ద్వారా నమూనా పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.పరీక్షల సమయంలో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముందుగానే ఈ ఫార్మాట్‌ పై అవగాహన కల్పించేందుకు ఈ నమూనా పత్రాలను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News