Wednesday, March 4, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంAadab Effect | కీచక ఉపాధ్యాయుడి ఉద్యోగం ఊస్ట్

Aadab Effect | కీచక ఉపాధ్యాయుడి ఉద్యోగం ఊస్ట్

  • విధుల నుండి తొలగిస్తూ డిఈఓ చైతన్య జైనీ ఉత్తర్వులు

కూసుమంచి మండలంలోని నరసింహులగూడెం ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థినీల పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఎస్జిటి ఉపాధ్యాయుడు జి.వీరయ్యను ఉద్యోగం నుండి (రిమూవల్ ఫ్రం సర్వీస్) తొలగిస్తూ జిల్లా విద్యాధికారిణి చైతన్య జైనీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.గతేడాది అక్టోబర్ 19 న విద్యార్థినీల పై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు అనే శీర్షికన ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలో ప్రచురితమైన కథనం పై అప్పటి విద్యాధికారిణి డా.పి.శ్రీజ స్పందించి విచారణ చేపట్టారు.విచారణ అనంతరం అక్టోబర్ 22 న ఉపాధ్యాయుడు జి.వీరయ్యను సస్పెండ్ చేశారు.

అదే విధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి.శివరావు సదరు ఉపాధ్యాయుడు పై పోలీస్ స్టేషన్ లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయగా పోక్సో కేసు నమోదు చేశారు.తాజాగా ఉపాధ్యాయుడిని సర్వీస్ నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థుల తల్లితండ్రులు,మేధావులు,విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ ఆదాబ్ హైదరాబాద్ కి అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News