ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం యాలాల్ మండలంలో ఏకగ్రీవం (Unanimously)గా ఎన్నికైన సర్పంచ్‌లను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి(Buyyani Manohar Reddy) అభినందించారు. జక్కేపల్లి గ్రామ సర్పంచ్ పెద్దింటి లాలప్ప, సంగెంఖుర్దు గ్రామ సర్పంచ్ సంగెం సుధాలక్ష్మి, కిష్టాపూర్ గ్రామ సర్పంచ్ పల్లె స్వప్న మహేష్.. పంచాయతీ ఎన్నికల్లో(Panchayat Elections) పోటీ లేకుండా గెలిచారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే.. సర్పంచ్‌లను, ఉపసర్పంచ్‌లను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ(Congress Government) పనితీరు మెచ్చి ప్రజలు పార్టీలకు అతీతంగా ఏకతాటిపైకి వస్తున్నారనటానికి ఈ ఏకగ్రీవ ఎన్నికలే నిదర్శనమని చెప్పారు.
- Advertisement -
