Wednesday, February 11, 2026
Homeబిజినెస్స్టాక్ మార్కెట్లు.. ఫ్లాట్‌గా ప్రారంభం..

స్టాక్ మార్కెట్లు.. ఫ్లాట్‌గా ప్రారంభం..

ఇవాళ (జూన్ 6 శుక్రవారం) ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లకు సంబంధించి నేడు ప్రకటన చేయనుండటంతో ఇన్వెస్టర్లు అలర్ట్ అయ్యారు. ఫలితంగా సూచీలు స్వల్ప నష్టాల్లో నడుస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిక్స్‌డ్ సిగ్నల్స్ వస్తున్నాయి. దీంతో దేశీయ షేర్ మార్కెట్‌లపై ఆ ప్రభావం పడింది. ఈ రోజు పొద్దున తొమ్మిదిన్నర సమయంలో సెన్సెక్స్ 57 పాయింట్ల నష్టంతో 81,384 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

నిఫ్టీ 7 పాయింట్లు లాస్ అయి 24,744 పాయింట్ల వద్ద నడుస్తోంది. సెన్సెక్స్‌లో టాటా మోటార్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయెన్స్ ఇండస్ట్రీస్, ఎయిర్‌టెల్, హెచ్‌డీ‌‌ఎఫ్‌సీ బ్యాంక్, టైటాన్, సన్‌ఫార్మా తదితర సంస్థల షేర్లు నేల చూపులు చూస్తున్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ 85.91 వద్ద ఉంది. బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ 65.11 డాలర్లు పలుకుతోంది. ఔన్స్ గోల్డ్ రేట్ 3,388 డాలర్లు చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News