Wednesday, February 18, 2026
Homeఎన్‌.ఆర్‌.ఐSrikanth | FIA అమెరికా చీఫ్‌గా తొలిసారి తెలుగు వ్యక్తి

Srikanth | FIA అమెరికా చీఫ్‌గా తొలిసారి తెలుగు వ్యక్తి

ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) ఆఫ్ యూఎస్ఏ అధ్యక్షుడిగా శ్రీకాంత్ అక్కపల్లి(Srikanth Akkapalli)ని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ పదవి చేపట్టనున్న తొలి తెలుగు వ్యక్తి(First Telugu Person)గా రికార్డ్ నెలకొల్పారు. ఈయన 2026 ఏడాదికి గాను అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. కొత్త కార్యవర్గం (New Working Group) నూతన సంవత్సరం రోజున ప్రమాణ స్వీకారం చేయనుంది. అమెరికా ఈస్ట్‌కోస్ట్‌లోని 8 రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం ఉన్న ఈ సమాఖ్యను 1970లో ఏర్పాటుచేశారు. ఇదొక లాభాపేక్ష లేని, సేవా భావంతో నడిచే సంస్థ.

దీనికి ఉపాధ్యక్షురాలిగా పృత్యి రే పటేల్, జనరల్ సెక్రటరీగా శృష్టి కౌల్ నరులా కొనసాగుతారు. శ్రీకాంత్ అక్కపల్లి పలు రంగాల్లో బిజినెస్ చేసి మంచి పేరు సంపాదించారు. సాంకేతికత, స్థిరాస్తి, మీడియా, ఆరోగ్య సంరక్షణ, ట్రాన్సిట్ టెక్నాలజీ, క్రీడా సామగ్రి తయారీ వంటి వాటితో విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలిచారు. 55 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ సంస్థకు అమెరికా కాంగ్రెస్ రికార్డ్‌(America Congress Record)లో అధికారిక గుర్తింపు ఉంది. రెండు గిన్నిస్ రికార్డులు(Guinness Records) సహా పలు అవార్డులు పొందింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News