Monday, February 16, 2026
Homeహైదరాబాద్‌Secunderabad | మహాశివరాత్రికి సిద్ధమైన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం

Secunderabad | మహాశివరాత్రికి సిద్ధమైన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం

  • దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
  • అయిదువేల మందికి దర్శన సదుపాయం సిద్ధం చేసిన ఆలయ నిర్వాహకులు

సికింద్రాబాద్‌లోని సీతాఫల్మండి ప్రాంతం సీతారామపురంలో వెలసిన ప్రసిద్ధ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విస్తృత స్థాయిలో ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేసింది. కోరిన కోర్కెలు తీర్చే దేవాలయంగా పేరుపొందిన ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు తరలివస్తారు.

దేవస్థానం ఫౌండర్ ట్రస్టీ చైర్మన్ నోముల ప్రకాష్ రావు గౌడ్ ఆధ్వర్యంలో ఆలయ నిర్వహణ సమర్థంగా కొనసాగుతోంది. ఈసారి మహాశివరాత్రి సందర్భంగా సుమారు 5,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు.

- Advertisement -

మంచినీటి సదుపాయం,ఎండ వేడి నుంచి రక్షణ కోసం చల్లటి పందిరి, టెంట్లు,విశ్రాంతి ఏర్పాట్లు చేశారు.అదేవిధంగా భక్తుల సేవలో నిమగ్నమయ్యేందుకు ప్రత్యేక వాలంటీర్ బృందాలను నియమించామన్నారు.మహాశివరాత్రి రోజున స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, రాత్రి జాగరణతో పాటు భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు.

తదుపరి సోమవారం రోజున ఆలయ ఆవరణలో అన్నదాన ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు ఆలయ చైర్మన్ వెల్లడించారు.మొత్తానికి,మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని విధాలుగా సిద్ధమైందని ఆలయ నిర్వాహకులు తెలిపారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News