- అన్ని వర్గాల వారికీ అందుబాటు ధరల్లో..
- సకల సౌకర్యాలతో ఏర్పాటు..
- అంబోత్ తండా సమీపంలో ఏర్పాటు..
- వివరాలు తెలియజేసిన నిర్వాహకులు నరహరి.., పరమేష్ లు..
రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం, లోయపల్లి గ్రామం.. అంబోత్ తండా, సత్యంతండా లకు మధ్య మార్గంలో నూతనంగా శ్రీ పరమేశ్వర ఫంక్షన్ హాల్ ప్రారంభమైంది.. ఈ ఫంక్షన్ హాల్ ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.. మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, అందుబాటు ధరల్లోనే అన్ని సకల సౌకర్యాలతో ఈ ఫంక్షన్ హాల్‌ను ఏర్పాటు చేయడం విశేషం.
ఈ సందర్భంగా నిర్వాహకులు నరహరి, పరమేష్ మాట్లాడుతూ, “ప్రతి కుటుంబం తమ శుభకార్యాలను ఆర్థిక భారం లేకుండా ఘనంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో పరమేశ్వర ఫంక్షన్ హాల్‌ను ప్రారంభించాం అని తెలిపారు.. వివాహాలు, నిశ్చితార్థాలు, పుట్టినరోజులు, శుభకార్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు వంటి అన్ని వేడుకలకు తగిన సదుపాయాలతో, పరిశుభ్రమైన వాతావరణంలో, తక్కువ ధరల్లో సేవలు అందించడమే మా లక్ష్యం” అని తెలిపారు.

ఈ ఫంక్షన్ హాల్‌లో విశాలమైన హాల్, సౌకర్యవంతమైన కూర్చోవడానికి ఏర్పాట్లు, శుభ్రమైన వంటశాల, తాగునీటి సదుపాయం, పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ బ్యాకప్ వంటి అన్ని అవసరమైన సదుపాయాలు కల్పించబడ్డాయి. ప్రతి ఒక్కరూ సంతృప్తిగా ఉండేలా, సేవలో నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తామని నిర్వాహకులు హామీ ఇచ్చారు.
మధ్యతరగతి ప్రజల ఆశలను నెరవేర్చే విధంగా, సరసమైన ధరల్లో అత్యుత్తమ సేవలను అందించే కేంద్రంగా పరమేశ్వర ఫంక్షన్ హాల్ అభివృద్ధి చెందాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు. ఈ నూతన ప్రారంభం విజయవంతం కావాలని, మరెన్నో కుటుంబాల శుభకార్యాలకు ఇది వేదిక కావాలని మనస్పూర్తిగా వారు కోరుకున్నారు..
