- ఆడియెన్స్ ఫస్ట్ ఛాయిస్‌గా ‘మృత్యుంజయ్’
కంటెంట్ కింగ్ శ్రీ విష్ణు, హుస్సేన్ షా కిరణ్ కాంబోలో తెరకెక్కిన ‘మృత్యుంజయ్’ చిత్రం గత వారం థియేటర్లోకి వచ్చింది. మార్చి 6న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. గత వారం విడుదలైన చిత్రాల్లో ఆడియెన్స్ ఫస్ట్ ఛాయిస్‌గా నిలిచింది. అంతే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగానూ ‘మృత్యుంజయ్’ సత్తా చాటుకుంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అయిన మృత్యుంజయ్ ప్రస్తుతం భారీ విజయంతో దూసుకుపోతోంది. లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు.
మార్చి 6న విడుదలైన ‘మృత్యుంజయ్’ మంచి మౌత్ టాక్‌తో, రివ్యూలతో ఆడియెన్స్‌లోకి బలంగా దూసుకు వెళ్లింది. ఈ సినిమాలోని కథ, కథనం అన్నీ కూడా కొత్తగా ఉండటం, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించడంతో ఆడియెన్స్ ఫిదా అయ్యారు. డే వన్ నుంచి కూడా కలెక్షన్స్ నిలకడగానే ఉన్నాయి. వీకెండ్‌లో సత్తా చాటిన మూవీ.. వీక్ డేస్‌లోనూ మెప్పిస్తోంది. అలా గడిచిన వారం రోజుల్లో ఆడియెన్స్‌కి ఫస్ట్ ఛాయిస్‌గా ‘మృత్యుంజయ్’ నిలిచింది.
సింగిల్ స్క్రీన్, మల్టీ ప్లెక్స్ అన్న తేడా లేకుండా అన్ని చోట్లా హౌస్ ఫుల్ బోర్డులతో సినిమా నడుస్తోంది. బలమైన ఆక్యుపెన్సీతో ఈ మూవీ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. టాలీవుడ్ నుంచి సైతం ‘మృత్యుంజయ్’కి మంచి రివ్యూలు వచ్చిన సంగతి తెలిసిందే. సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్, నేచురల్ స్టార్ నాని ఇచ్చిన రివ్యూలు సైతం సినిమా సక్సెస్‌లో భాగమయ్యాయి.
పైగా పోటీలో ఎలాంటి బ్లాక్ బస్టర్ చిత్రం లేకపోవడం ‘మృత్యుంజయ్’కి మరింతగా కలిసి వచ్చింది. ఈ వారం కూడా ‘మృత్యుంజయ్’ దూసుకుపోయేలా కనిపిస్తోంది. ఇలానే మంచి ఆక్యుపెన్సీతో దూసుకుపోతే మున్ముందు ‘మృత్యుంజయ్’ బ్లాక్ బస్టర్‌గా నిలిచే అవకాశం ఉంది. మంచి కంటెంట్, కొత్త కథలు వస్తే ఆదరిస్తామని మరోసారి ప్రేక్షకులు నిరూపించారు.
