- సిద్దిపేటలో 182 మంది సస్పెండ్
మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విధులకు హాజరు కాని 182 మంది ఉద్యోగులపై జిల్లా కలెక్టర్ హైమావతి కొరడా జులిపించారు..కలెక్టర్ ప్రకటన ప్రకారం, సస్పెండ్ అయిన వారు స్థానిక ఎన్నికల కార్యకలాపాలలో హాజరు కాలేదు. ఈ నెల 10వ తారీఖున సిద్దిపేట జిల్లా పరిధిలోని దౌల్తాబాద్, గజ్వేల్, జగదేవపూర్, మర్కుక్, ములుగు, రాయపోల్, వర్గల్ మండలాల్లో మొదటి విడత ఎన్నికలు జరగడం తెలిసిందే. ఈ ఎన్నికల్లో 149 సర్పంచులు, 1,208 వార్డు మెంబర్స్ ఎంచుకోబడ్డారు.సాధారణంగా ఎన్నికల విధుల్లో గైర్హాజరు కాని ఉద్యోగులపై ఈ విధమైన కఠిన చర్యలు నియమాలకు అనుగుణంగా తీసుకోవడం జరుగుతుందంటూ ఆమె పేర్కొన్నారు.
- Advertisement -
