Thursday, March 26, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంCorruption | ప్రభుత్వ జీతం.. ప్రైవేట్ సామ్రాజ్యం

Corruption | ప్రభుత్వ జీతం.. ప్రైవేట్ సామ్రాజ్యం

  • షాద్నగర్ డిప్యూటీ డీఎం అండ్ హెచి ‘విజయ’ విహారం
  • సర్కారు కొలువులో ‘సంతకాల’ మాయాజాలం..
  • నెలల తరబడి విధులకు గైర్హాజరు…!
  • ప్రైవేట్ ఆసుపత్రికి బ్రాండ్ అంబాసిడర్గా జిల్లా స్థాయి అధికారిణి!
  • అధికారిక హోదా అడ్డం పెట్టుకుని ‘శారద ఫెర్టిలిటీ’ ప్రమోషన్లు!
  • ఒకే రోజు నెలల సంతకాలు.. ప్రాక్సీ అటెండెన్స్తో ఖజానాకు కన్నం!
  • నిబంధనలు గాలికొదిలేసి ‘విజయ హాస్పిటల్’ పోస్టర్లపై ఫోటోల ప్రదర్శన!
  • తనిఖీలు చేయాల్సిన ఆమే.. అక్రమ దందాలకు అండగా నిలుస్తున్నారా?

ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ఒక అత్యున్నత స్థాయి అధికారిణి, తన అధికారిక హోదాను సొంత వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి వాడుకుంటున్న తీరు ఇప్పుడు షాద్‌నగర్ నియోజకవర్గంలో సంచలనంగా మారింది. జిల్లా డిప్యూటీ వైద్యాధికారి డాక్టర్ విజయలక్ష్మి వ్యవహారశైలిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నియమ నిబంధనలను తుంగలో తొక్కి, విధులకు వెళ్లకుండానే లక్షల రూపాయల జీతాన్ని పొందుతూ, తన సొంత ప్రైవేట్ ఆసుపత్రుల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఆమెపై షాద్‌నగర్ నియోజకవర్గంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

  • సంతకాల ఫోర్జరీ.. విధుల్లో గైర్హాజరు!

నెలల తరబడి విధులకు హాజరుకాకుండా, డ్యూటీ రిజిస్టర్‌లో సంతకాలు చేయకుండా ఖాళీగా వదిలేసినట్లు ఆధారాలు బయటపడ్డాయి. అయితే, ఉన్నతాధికారుల తనిఖీ భయంతోనో లేక అక్రమంగా జీతం డ్రా చేయడానికో గానీ, ఇటీవలే ఆమె ఆ ఖాళీ రిజిస్టర్‌లో ఒకే రోజు నెలల తరబడి సంతకాలు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి ఆమె విధులకు రావడం లేదని, కేవలం పేపర్ల మీద మాత్రమే డ్యూటీ చేస్తున్నారని స్పష్టమవుతోంది. కొన్ని సందర్భాల్లో కింది స్థాయి ఉద్యోగులతో కూడా సంతకాలు చేయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

- Advertisement -
  • ప్రైవేట్ ఆసుపత్రి ప్రమోషన్లే పరమావధి!

ఫిబ్రవరి 26న షాద్‌నగర్‌లో ‘శారద ఫెర్టిలిటీ సెంటర’ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆమె, ఒక ప్రభుత్వ అధికారి అనే విషయాన్ని మరిచిపోయి మీడియా ముందు ఆ ప్రైవేట్ ఆసు పత్రికి ప్రచారం కల్పించడం విస్మయానికి గురిచేసింది. “మా ఆసుపత్రి గురించి మంచిగా రాయండి, పేషెంట్లు వచ్చేలా చూడండి” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటు ప్రభుత్వ విధుల్లో ఉన్నట్లు సంతకాలు పెట్టి, ఇటు ప్రైవేట్ ఆసుపత్రి వేడుకల్లో పాల్గొనడం ఆమె ద్వంద్వ వైఖరికి నిదర్శనం.

  • సర్వీస్ రూల్స్ ఉల్లంఘన.. అడ్వర్టైజ్‌మెంట్లతో హల్చల్!

సివిల్ సర్వీసెస్ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఏ ప్రభుత్వ అధికారి కూడా ప్రైవేట్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండకూడదు. కానీ, డాక్టర్ విజయలక్ష్మి తన సొంత ‘విజయ హాస్పిటల’ తరపున నిర్వహించే మెడికల్ క్యాంపుల పోస్టర్లపై తన ఫోటోను ముద్రించుకుని బాహాటంగా ప్రచారం చేసుకుంటు న్నారు. జిల్లా స్థాయి అధికారిగా ప్రైవేట్ ఆసుపత్రులపై నిఘా ఉంచాల్సిన ఆమే, ఇలా నిబంధనలను ఉల్లంఘించడంపై ప్రజలు మండిపడుతున్నారు.

  • సిబ్బందిపై వేధింపులు.. అక్రమాలకు అండ!

నియోజకవర్గంలో నడుస్తున్న నకిలీ ల్యాబ్‌లు, అర్హత లేని ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాల్సిన ఆమె, మామూళ్ల మత్తులో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తన మాట వినని కింది స్థాయి సిబ్బందిని డిప్యుటేషన్ల పేరుతో వేధిస్తూ, దూర ప్రాంతాలకు బదిలీ చేస్తానని భయపెడుతున్నట్లు సమాచారం. తన డ్యూటీ స్థానంలో వేరే డాక్టర్‌ను ఉంచి, ఆమె మాత్రం ప్రైవేట్ ప్రాక్టీస్‌లో నిమగ్నమవ్వడం ఆమె అధికార దుర్వినియోగానికి పరాకాష్ట.ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించి ఆమెపై సమగ్ర విచారణ జరిపి, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్న డాక్టర్ విజయలక్ష్మిని వెంటనే సస్పెండ్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News