Tuesday, February 10, 2026
Homeరంగారెడ్డిSavitribai Phule | మహిళల విద్యకు మార్గదర్శిని సావిత్రిబాయి ఫూలే

Savitribai Phule | మహిళల విద్యకు మార్గదర్శిని సావిత్రిబాయి ఫూలే

  • ఎంఈఓ విఠల్
  • ఎం సోమక్కపేటలో సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి నివాళులు
  • జెడ్పిహెచ్ఎస్ మహిళా ఉపాధ్యాయులకు ఘన సన్మానం

భారతదేశ మహిళా విద్య చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడిన మహనీయురాలు సావిత్రిబాయి ఫూలే మహిళలకు మార్గదర్శిని అని చిలిపిచేడ్ ఎంఈఓ విఠల్ కొనియాడారు. మహనీయురాలు సావిత్రిబాయి ఫూలే 195వ జయంతిని పురస్కరించుకొని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల సోమక్కాపేటలో మహిళ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. మొట్టమొదట శ్రీమతి సావిత్రి భాయి ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పాఠశాలలో మహిళ ఉపాధ్యాయులు విజయ, సంగీతలను ఘనంగా శాలువాలతో సన్మానించారు.

ఈ సందర్భంగా చిలిపిచేడ్ మండల విద్యాధికారి విఠల్ మాట్లాడుతూ.. సావిత్రిబాయి ఫూలే మహిళలకు విద్య అనేది నిషేధంగా భావించబడిన సమయంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రోత్సాహంతో చదువుకుని, దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా నిలిచారని,1848లో పూణెలో బాలికల కోసం తొలి పాఠశాలను ప్రారంభించడం ఆమె జీవితంలోని గొప్ప మైలురాయని,మహిళల విద్యకు,కులవ్యవస్థకు వ్యతిరేకంగా,బాల్యవివాహాల నిర్మూలనకు, సామాజిక సమానత్వానికి ఆమె నిరంతరం కృషి చేశారని ఆమె కేవలం ఉపాధ్యాయురాలు మాత్రమే కాదని, సామాజిక సంస్కర్త,కవి,మానవతావాది కూడా.

- Advertisement -

“కవితా ఫూలే” వంటి రచనల ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేశారని, ప్లేగ్ వంటి విపత్తుల సమయంలో రోగులకు సేవ చేస్తూ 1897లో ప్రాణత్యాగం చేశారని, “విద్యే నిజమైన విముక్తి మార్గం” ఆమె మనకు నేర్పిన సందేశం అన్నారు.ఆ మహనీయురాలి ఆశయాలను మన జీవితాల్లో అమలు చేస్తూ,విద్య ద్వారా సమాజాన్ని మార్చే బాధ్యత మనందరిదని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అజయ్ కుమార్, యాదగౌడ్,మోహన్,మహేష్ కుమార్, విష్ణువర్ధన్ విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News