Tuesday, February 10, 2026
Homeమహబూబ్‌నగర్‌Funds | 3 కోట్ల 73 లక్షలు ప్రత్యేక అభివృద్ధి పనులకు నిధులు మంజూరు.

Funds | 3 కోట్ల 73 లక్షలు ప్రత్యేక అభివృద్ధి పనులకు నిధులు మంజూరు.

  • మంజూరు చేయించిన వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి..
  • హర్షం వ్యక్తం చేసిన పార్టీ నాయకులు..

వనపర్తి, పెబ్బేరు మున్సిపాలిటీలో వీధి దీపాలు, పలు కమ్యూనిటీ హాళ్లు, అంగన్వాడి భవనాల బలోపేతం, కుల సంఘాల భవన నిర్మాణాలకు తదితర పలు అభివృద్ధి పనుల నిమిత్తం వనపర్తి, పెబ్బేరు మున్సిపాలిటీలకు శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి 3 కోట్ల 73 లక్షలు రూపాయలను మంజూరు చేయించడం తో వనపర్తి, పెబ్బేరు కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిధుల మంజూరితో రెండు మున్సిపాలిటీలలో లో మెకానిక్ యూనియన్ సంఘం భవనం, ఉపధ్యాయ సంఘ భవనం, కార్మిక సంఘ భవనం రజక సంఘ భవనం, బీసీ కమ్యూనిటీ హాల్ పలు అంగన్వాడీ, వీధి దీపాల ఏర్పాటు లాంటి పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వారు తెలిపారు. అహర్నిశలు నియోజకవర్గ అభివృద్ధి కోసం పని చేసే శాసనసభ్యులు మేఘా రెడ్డి కి పార్టీ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News