Friday, May 1, 2026
Homeకెరీర్ న్యూస్Revanth Reddy | విద్యార్థులకు అవసరమైన కిట్స్ అందిస్తాం..

Revanth Reddy | విద్యార్థులకు అవసరమైన కిట్స్ అందిస్తాం..

  • ఈమేరకు అధికారులకు ఆదేశాలు జారీ..

విద్యార్థుల‌కు అవ‌స‌ర‌మైన సామ‌గ్రి అంతా స‌కాలంలో అందేలా చూడాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దుస్తులు, నోటు పుస్త‌కాలు, ఇత‌ర సామ‌గ్రి స‌కాలంలో అందితే విద్యార్థులు చదువుపై పూర్తి స్థాయిలో శ్ర‌ద్ధ చూపుతార‌ని సీఎం అన్నారు. విద్యా శాఖ‌తో పాటు బీసీ, మైనారిటీ, గిరిజ‌న‌ సంక్షేమ శాఖ‌లు, ఎస్సీ డెవ‌ల‌ప్‌మెంట్ శాఖ‌ల ప‌రిధిలోని విద్యా సంస్థ‌ల్లోని విద్యార్థుల‌కు అంద‌జేసే సామ‌గ్రి సెంట్ర‌లైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్‌పై సీఎం రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం స‌మీక్ష నిర్వ‌హించారు. గ‌తంలో ఏ శాఖ‌కు ఆ శాఖ ప్రొక్యూర్‌మెంట్, స‌ర‌ఫ‌రా చేప‌ట్ట‌డంతో ఏక‌రూప‌త లోపించ‌డంతో పాటు అనేక అక్ర‌మాలు చోటుచేసుకునేవ‌ని, వాటిని అరిక‌ట్టేందుకు సెంట్ర‌లైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ విధానాన్ని తీసుకువ‌చ్చామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News