Homeఆదాబ్ ప్రత్యేకంCM Revanth Reddy | ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న మున్సిపల్‌శాఖలో అక్రమ నిర్మాణాలు..!

CM Revanth Reddy | ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న మున్సిపల్‌శాఖలో అక్రమ నిర్మాణాలు..!

అసలు అయ్యప్ప సొసైటీకి ప్రత్యేక చట్టాలు ఉన్నాయా..? అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం ఎప్పుడు కొరడా ఝుళిపిస్తుంది..? అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత పాలకులు, అధికారులపై ఉంది.

  • ఇక్కడ పనిచేసే అధికారులకు సీఎం శాఖ అని తెలియదా..?
  • అయ్యప్ప సొసైటీకి ప్రత్యేక అధికారాల జీఓ ఏమైనా ఉందా…?
  • ఇక్కడ అక్రమ నిర్మాణాలను తక్షణమే సీజ్ చేయండి
  • ఇప్పటికే పూర్తయిన నిర్మాణాలపై చర్యలు తీసుకోండి
  • వేలాది ప్రాణాలను ప్రమాదాల నుంచి కాపాడండి
  • రాజకీయ నేతల అరాచకాలకు కళ్లెం వేయండి
  • ప్రజా ప్రభుత్వంలో మీ నిజాయితీని నిరూపించుకోండి

మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. కోర్టు పరిధిలో ఉన్న భూముల్లోనే ఐదు నుంచి ఎనిమిది అంతస్తుల భవనాలు వెలుస్తున్నా అధికారుల చర్యలు శూన్యమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 80కి పైగా అక్రమ నిర్మాణాలు ఉన్నాయన్న ఆరోపణల వెనుక ఎవరున్నారు..? నిర్మాణదారులకు అండగా నిలుస్తున్నదెవరు..? అధికారుల మౌనం వెనుక మర్మమేమిటి..? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy), సీఎంసీ కమిషనర్ జోక్యం చేసుకుని అక్రమ నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
Ayyappa Society Illegal Constructions Raise Questions in Madhapur0001

ఇది మీరు ఎప్పుడూ వినని కథ.. హైదరాబాద్‌లోనే నెలకొని ప్రభుత్వ నిబంధనలు అతీతంగా కొనసాగుతున్న ఒక ప్రాంతం కథ.. అక్రమాలకు, అవినీతికి అద్దం పడుతున్న వ్యవస్థ కథ.. ప్రభుత్వం, అధికారులు, రాజకీయనాయకులు కాసుల మైకంలో కళ్ళు బైర్లు కమ్మి, అక్రమ నిర్మాణదారుల మోకాళ్లపై కూర్చుని మోకరిల్లుతున్న దారుణ చరిత్ర.. ఆ ప్రాంతం మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీ.. అక్కడ జరుగుతున్నవి చట్ట విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు.. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న అక్రమార్కుల చరిత్రలు.. కళ్ళున్న కబోదిలాగా మారిన ప్రభుత్వాల దారుణ ప్రవర్తన.. వెరసి అక్రమ నిర్మాణదారులు రాజ్యమేలుతున్న ఒక అంతులేని అవినీతి చరిత్ర..

హైదరాబాద్: మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణదారులకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.. మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అని రెచ్చిపోతున్నారు.. ఎవరైనా అడిగితే పచ్చునోట్లు పడేస్తాం.. అంటూ కాలరు ఎగరేస్తూ చెబుతున్నారు.. మనీతో ఎవర్నైనా కొనేస్తాం.. మున్సిపల్ అంతా మాముందు మోకాళ్ళ మీద మోకరిల్లుతుంది.. చిటికేస్తే పనులు జరిగిపోతాయి.. రాజకీయ నాయకులు సైతం మా వెనకాల ఉన్నారు.. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మాకు సలాం కొట్టాల్సిందే.. రాజకీయనాయకులకు కమిషన్లు ఇస్తాం.. పార్టీలకు ఫండ్స్ ఇస్తాం.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు.. అడ్డుకోవడానికి సాహసించరు..

ఇక్కడ మేము చెప్పిందే వేదం.. మేము చేసిందే చట్టం.. రూల్స్ మావే.. లక్షలు కుమ్మరించి స్థలాలు కొంటారు.. కోట్లు వెచ్చించి పెద్ద పెద్ద బిల్డింగులు కడతారు.. నిర్మాణం జరుగుతున్నప్పుడే అమ్మకాలు కూడా జరిగిపోతాయి.. అడ్వాన్సులు వచ్చేస్తాయి.. బిల్డింగ్ ఎప్పుడు పూర్తవుతుందా..? ఎప్పుడెప్పుడు అక్కడ వాలిపోదామా అని ఎంతో మంది కాచుకు కూర్చుంటారు.. అయ్యప్ప సొసైటీ అంటే అంతటి ప్రైమ్ ఏరియా మరి.. వేలకోట్లకు పడగలెత్తిన రియల్ మాఫియా మొత్తం అయ్యప్ప సొసైటీ చుట్టే తిరుగుతుంటారు.. వారంతా వ్యవస్థలను శాసిస్తారు.. తమ అక్రమ సామ్రాజ్యాన్ని నిరాటంకంగా కొనసాగిస్తారు.. ఇక్కడ నిర్మాణాలు జరుపుకుంటున్న ఒక్కో బిల్డింగ్ వెనకాల ఒక్కో అంతులేని చరిత్ర ఉంటుంది.. ఆ చరిత్రను తుడిచేయడానికి ఎవరూ సాహసించరు..

అర్ధంకాని విషయం ఏమిటంటే అయ్యప్ప సొసైటీకి ఒక ప్రత్యేకమైన ప్రభుత్వం ఉందా..? అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సపరేటుగా ఉన్నాయా..? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో అమలవుతున్న నియమ, నిబంధనలు ఇక్కడ ఎందుకు అమలవడం లేదు.. పోనీ అయ్యప్ప సొసైటీ కోసం ప్రత్యేకమైన జీఓ ఏమైనా అమల్లోకి వచ్చిందా..? అన్నది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది.. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా అయ్యప్ప సొసైటీ భూముల వ్యవహారం న్యాయస్థానం పరిథిలో ఉంది.. కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వకుండా, ఎలాంటి నిర్ణయం ప్రకటించక పోవడం జరుగుతోంది..

Ayyappa Society Illegal Constructions Raise Questions in Madhapur2

దాని మీద విచారణ కొనసాగుతోంది.. ఈ క్రమంలో అయ్యప్ప సొసైటీలో భూముల క్రయవిక్రయాలు జరుగకూడదు.. అక్కడ ఎలాంటి నిర్మాణ అనుమతులు ప్రభుత్వం ఇవ్వకూడదు.. కరెంట్, డ్రైనేజ్ లాంటి మున్సిపల్ అనుమతులు ఇవ్వడానికి వీలులేదు.. కానీ ఇక్కడ నిర్మాణాలు ఎలా కొనసాగుతున్నాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.. ఎవరికీ అంతుబట్టని రహస్యం.. న్యాయవ్యవస్ఠ ఏమి చేస్తోంది..? పాలక ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయి..? మరీ విచిత్రం ఏమిటంటే ఇక్కడి నిర్మాణదారులు పెండింగ్ రిజిస్ట్రేషన్లు చేసుకోవడం ఆ తరువాత కోర్టు ఆర్డర్ తో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ రిలీజ్ చేసుకుంటున్నారు..

చట్టాల్లోని లొసుగులను తమకు అనుగుణంగా మార్చుకుంటున్నారు.. ఇక్కడ గజం సుమారు 2 లక్షల రూపాయల పై చిలుకు పలుకుతుంది.. ఒక చదరపు అడుగు దాదాపు రూ. 7000 నుంచి 10000 వరకు ఉంటుందని తెలుస్తోంది.. ఇంత బహిరంగంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి.. కోట్లు ఖర్చుబెట్టి బిల్డింగులు నిర్మించడం.. కోటాను కోట్లు కొల్లగొట్టడం ఇక్కడ అక్రమ నిర్మాణదారులకు నిత్యకృత్యం అయిపొయింది..

Ayyappa Society Illegal Constructions Raise Questions in Madhapur01

మరి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రావా..? అంటే వచ్చే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.. అప్పుడు ఇక్కడ బిల్డింగులు, స్థలాలు కొనుగోలు చేసిన వారికి ఎదురయ్యే సమస్యలు అన్నీ ఇన్నీ కావు.. ఇది యదార్ధం.. మరి ఈ పరిస్థితి ఎప్పుడు వస్తుందో చెప్పలేము.. మరో విషయం ఏమిటంటే ఈ ప్రాంతానికి 11/31, 12 అనే సర్వే నెంబర్స్ కూడా ఉన్నాయి.. ఈ సర్వే నెంబర్స్ కోర్టు పరిధిలో విచారణలో ఉన్న విషయం కూడా చెప్పుకున్నాం..

పైగా ఇక్కడ అక్రమంగా పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడమే కాకుండా ఎలాంటి కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదు నిర్మాణదారులు.. బిల్డింగ్ కు వదలాల్సిన కనీస సెట్ బ్యాక్ స్థలం కూడా వదలడం లేదు.. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదు.. భవిష్యత్తులో ఏదైనా అగ్నిప్రమాదం సంభవిస్తే వందల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.. కనీసం ఫైర్ సర్వీస్ వాహనాలు కూడా వచ్చే వీలుండదు. అంబులెన్స్ సైతం వచ్చే వీలుండదు.. పైగా నిర్మాణాలు సైతం నాశిరకంగా వుంటున్నా యన్నది పలువురు చెబుతున్న మాట.. నివాస బిల్డింగులులే కాకుండా కమర్షియల్ బిల్డింగ్స్ నిర్మిస్తూ.. నిర్మాణదారులు కోట్ల రూపాయలు కొల్లగొడుతూ ఉన్నారు..

ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఎలాంటి ఢోకా ఉండదు.. ఇక్కడ వ్యాపారాలన్నీ జీరో మనీతో సాగుతుంటాయి.. ఎందుకంటే ఇక్కడ బ్యాంకులు లోన్స్ ఇవ్వవు.. అందుకే ఇక్కడ అంతా బ్లాక్ మనీ సర్క్యులేట్ అవుతుంది.. నో వైట్ ఓన్లీ బ్లాక్.. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ వందలకొద్దీ అక్రమ బిల్డింగులు నిర్మిస్తూ ఉంటారు.. కాగా కొందరు ఆ ప్రాంతానికి చెందిన అధికారులకు ఇక్కడ అక్రమ నిర్మాణాలు వారికి కనిపించవు.. కేవలం పచ్చనోట్లు మాత్రమే కనిపిస్తుంటాయి..

Ayyappa Society Illegal Constructions Raise Questions in Madhapur02

ఈ క్రమంలో ఈ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ అధికారులు కొందరు కోటీశ్వరులు అయిపోతున్నారు.. ఇక్కడ జరుగుతున్న వ్యవ హారంపై ప్రభుత్వానికి విజిలెన్స్ అధికారులు ఎలాంటి రిపోర్ట్స్ ఇవ్వవు.. విషయం ఏమిటంటే ఇక్కడ అందరికీ అమ్యాయాలు అందు తూనే ఉంటాయి.. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ ప్రాంతానికి ఎవరు ఎమ్మెల్యే అయినా వారికి 3 పూవులు 6 కాయలు.. డబ్బులే డబ్భులు.. కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు 3 సంవత్సరాలు కావొస్తోంది.. కనీసం ఇప్పటివరకు అటువైపు దృష్టి సారించిన దాఖలాలు లేవు..

ఈ ప్రాంతానికి ఏపార్టీ నుంచి ఏ నాయకుడు ప్రజాప్రతినిథిగా ఎన్నికైనా సరే అతని పంట పండినట్లే.. లక్షల్లో అక్రమార్జన దొరుకుతుంది.. అయితే విచిత్రం ఏమిటంటే ఇక్కడ ప్రభుత్వ విజిలెన్స్ డిపార్ట్మెంట్ సైతం జరుగుతున్న వ్యవహారాలపై ఎలాంటి రిపోర్టులు ఇచ్చిన దాఖలాలు లేవు.. అయితే ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న అక్రమ నిర్మాణాల దందా ప్రభుత్వాల దృష్టికి రావడం లేదా..? అంటే అనుమానమే.. వచ్చినా సరే పట్టించుకోవడం లేదంటున్నారు విశ్లేషకులు అయితే ఈ ప్రాంతం నుంచి చేతులు మారుతున్న డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్తోంది..? అన్నది ప్రశ్నార్థకమే..

పైగా అయ్యప్ప సొసైటీలో పలు స్కూళ్ళు, కాలేజీలు కిరాయి బిల్డింగ్స్ లో నడుస్తున్నాయి.. ఆ విద్యాసంస్థల యాజమాన్యం ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించడమే కాకుండా.. అక్కడ ఎలాంటి సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడంతో విద్యార్థుల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోతోంది.. అక్రమార్కులు బిల్డింగులు నిర్మిస్తున్నారు.. ఓవైపు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు.. మరోవైపు కిరాయిలకు ఇచ్చు కుం టూ లక్షలు గడిస్తున్నారు.. ఇది నిరంతరాయంగా కొనసాగు తున్న ప్రక్రి యగా కనిపిస్తోంది.. అక్రమానిర్మాణాలు ఎన్నెన్ని ప్రాణాలను బలి తీసుకుం టున్నాయో మనం చూస్తూ ఉన్నాం..

అలాంటిది అయ్యప్ప సొసైటీలో బహిరంగంగా అక్రమానిర్మాణాలు జరుగుతుంటే ఇంకెంత మంది ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి అని ప్రశ్నిస్తున్నారు సామాజికవేత్తలు.. అయ్యప్ప సొసైటీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై ఎన్నెన్నో కథనాలను, ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకుని వస్తూనే ఉంది ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘.. కానీ అధికారులు గానీ, ప్రభుత్వం కానీ స్పందించిన పాపానపోలేదు..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా ఉన్నప్పుడు అక్రమానిర్మాణాలు ఇబ్బడి ముబ్బడిగా జరుగుతున్నాయి..

వాటిని కట్టడి చేయలేకపోతున్నాం అనే ఉద్దేశ్యంతో మూడు కార్పొరేషన్లుగా అంటే జీ.హెచ్.ఎం.సి., ఎం.ఎం.సి., సీఎంసీ అని మూడు కార్పొరేషన్లుగా విభజించి పరిపాలన సజావుగా సాగేలా రేవంత్ ప్రభుత్వం ముందుకు వెళ్ళింది.. కానీ దురదృష్టం ఏమిటంటే మూడు కార్పొరేషన్లుగా విడిపోయిన తర్వాత కూడా అక్రమ నిర్మాణాలు యధావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి.. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) పరిధిలోకి వచ్చే అయ్యప్ప సొసైటీలో నైతే అంతులేకుండా అక్రమానిర్మాణాలు కొనసాగుతున్నాయి.. ఇప్పటికీ దాదాపు 80కి పైగానే అక్రమానిర్మాణాలు కొనసాగుతున్నాయి..

అయితే అర్ధం కానీ విషయం ఏమిటంటే అన్ని ప్రాంతాలకు అతీతంగా అయ్యప్ప సొసైటీకి ప్రత్యేకత ఏదైనా ఉందా..? ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలకు ఏదైనా రహస్య జీఓ ఇచ్చారా..? తేలాల్సివుంది.. అయితే ఇక్కడో ప్రమాదం పొంచివుంది.. అయ్యప్ప సొసైటీని సాకుగా చూపిస్తూ మిగతా ప్రాంతాల్లో సైతం అక్రమ నిర్మాణాలు వెలిస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారు..? అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తున్నప్పుడు మనకేంటి భయం అనుకుంటే భవిష్యత్తులో ఎన్నెన్నో సమస్యలు ఎదురవుతాయి.. అయ్యప్ప సొసైటీలో 5 నుంచి 8 అంతస్తులు అక్రమంగా నిర్మిస్తున్నారు..

కనుక ముఖ్యమంత్రి గారూ మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా వున్నారు.. మరి మీ మున్సిపల్ శాఖలో కొనసాగుతున్న ఈ దారుణాలు మీ దృష్టికి రావడం లేదా..? ఒకవేళ వచ్చినా మీరు పట్టించుకోవడంలేదా..? ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే మిమ్మల్ని కూడా అనుమానించాల్సి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.. కనుక తక్షణమే అయ్యప్ప సొసైటీ మీద దృష్టి సారించి ఈ అనుమానాలను తొలగించండి..

అధికారులు వేరే ప్రాంతంలో కూల్చివేతలు చేస్తున్నాం అంటూ తమ అధికారిక సీఎంసీ అఫీషియల్ వెబ్ సైట్ లో పెడుతున్నారు.. కానీ అయ్యప్ప సొసైటీలో అసలు అనుమతులు లేకుండానే నిర్మాణాలు సాగుతున్న ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.. దీనికి ముఖ్యమంత్రి గారు(CM Revanth Reddy) సమాధానం చెప్పగలరా..? మరి సీఎంసీ ఈ వ్యవహారంపై కమిషనర్ జీ. శ్రిజన, ఐఏఎస్ సమాధానం చెప్పవలసిన అవసరం కూడా ఎంతో వుంది..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News