Thursday, March 5, 2026
Homeరంగారెడ్డిLabour Codes | లేబర్ కోర్డుల రద్దుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలి

Labour Codes | లేబర్ కోర్డుల రద్దుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలి

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడులను రద్దు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని బహుజన లెఫ్ట్ కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఐఎఫ్టీయూ జాతీయ కన్వీనర్ షేక్ షావలి, ఏఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు వై మల్లేష్ నేతృత్వంలో మేడ్చల్ కలేక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలేక్టర్ రెవెన్యూ విజయేంద్ర రెడ్డికి సోమవారం వినతిపత్రం సమర్పించారు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్స్ బిల్ 2020, విత్తన బిల్ 2025, విద్యుత్ సవరణ బిల్ 2025, విబి జిఆర్ఎఎం జి చట్టం 2025లకు వ్యతిరేకంగా 2026 ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు జాతీయ కార్మిక రైతు సంఘాల జేఏసీ పిలుపునిచ్చిందని తెలిపారు. ఈ సమ్మెకు తెలంగాణ బహుజన వామపక్ష కార్మిక సంఘాల జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని వెల్లడించారు.

- Advertisement -

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక కార్పొరేట్ ఆధిపత్య ఆర్థిక విధానాల వల్ల అన్ని రంగాలు తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడుతున్నాయని పేర్కొన్నారు. వెంటనే ప్రజావ్యతిరేక విధానాలను విడనాడేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

2016 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 26 వేల రూపాయలు అమలు చేయాలని, ఔట్ సోర్సింగ్ కార్మికులు విధి నిర్వహణలో మృతి చెందితే కుటుంబ సభ్యులకు 50 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేసియా, సహజ మరణం జరిగితే 25 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేసియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు తగిన చర్యలు చేపట్టాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, ఆలోపు కనీస వేతనం 26 వేల రూపాయలు అమలు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ విముక్తి నాయకురాలు పి సునీత పాల్గొని లేబర్ కోడులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News