- ఐ.ఎస్.ఐ., జైషే మహ్మద్ సంస్థలు కలిపి ప్లాన్..
- హెచ్చరిస్తున్న భారత ఇంటెలిజెన్స్ వర్గాలు..
- భద్రత కట్టుదిట్టం చేసిన రక్షణ బలగాలు..
- అలెర్ట్ అయిన దేశ రాజధాని ఢిల్లీ పోలీసులు..
భారత్ ను టార్గెట్ చేశారు.. దానికి రిపబ్లిక్ డే ను ఎంచుకున్నారు.. భారీ విద్వాంసం సష్టించేందుకు స్కెచ్ వేశారు.. పాక్ కు చెందిన గూఢచార సంస్థ ఐ.ఎస్.ఐ. అలాగే జైషే మహ్మద్ సంస్థలు కలిసి కుట్ర పన్నుతున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ కుట్రకు “26`26” అని కోడ్ నేమ్ పెట్టినట్లు సమాచారం. ఈ హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ వంటి సున్నిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయిపోయారు.. అల్ ఖైదా ఇండియన్ సబాకాంటినెట్ ఉగ్రవాది, ఢిల్లీకి చెందిన మహ్మద్ రెహాన్ ఫోటోలతో వాంటెడ్ జావితాను విడుదల చేశారు.. ఇదే కాకుండా, బెంగళూర్ లోని రామేశ్వరం కేజ్ లో పేలుడుకు సూత్రధారిగా భావిస్తున్న షాహిద్ ఫైసల్ పేరును కూడా నోటీసుల్లో చేర్చింది.
అయితే ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం, దేశవ్యాప్తగా రిపబ్లిక్ డే రోజు ఒకే సారి పలు ప్రాంతాల్లో దాడులు చేయాలని, ప్రజల్లో భయాందోళన రేకెత్తించాలని ఉగ్రవాదులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ కుట్రలో పాక్ ప్రేరేపిత జైషే మహ్మద్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. కాశ్మీర్ లో దాడికి చేయడానికి సంకేతాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. రామమందిరం కూడా ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, సోషల్ విÖడియా ద్వారా యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ గుర్తించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
