Tuesday, February 10, 2026
Homeఎన్‌.ఆర్‌.ఐAp Handcraft | విదేశాల్లో ఏపీ హస్త‘కళ’కళ

Ap Handcraft | విదేశాల్లో ఏపీ హస్త‘కళ’కళ

  • సింగపూర్‌లోని ఇండియా ఎంబసీలో రిపబ్లిక డే వేడుకలు
  • అతిథులకు ఏపీ హస్తకళల గిఫ్ట్ ఇవ్వాలని హైకమిషన్ నిర్ణయం
  • లేపాక్షికి 400 గిఫ్ట్ బాక్సులకు ఆర్డర్
  • ఒక్కో బాక్స్‌లో సీతాదేవి లెదర్ పప్పెట్రీ, ఏనుగు ఆకారపు బ్యాగేజ్ ట్యాగ్, హ్యాండ్ పెయింటెడ్ ఏనుగు, కోస్టర్ కళారూపాలు
  • ఏపీ హస్తకళలకు అంతర్జాతీయ గుర్తింపుపై మంత్రి సవిత హర్షం
  • విదేశాల్లోనూ లేపాక్షి షో రూమ్‌ల ఏర్పాటుకు నిర్ణయం
  • హస్తకళల పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి

ఏపీ హస్తకళలకు అంతర్జాతీయ స్థాయి(International Level)లో మరో గుర్తింపు(Recognition) సాధించినట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత(Minister Savitha) తెలిపారు. సింగపూర్‌(Singapore)లోని ఇండియా హైకమిషన్ ఆఫీసు(Indian High Commission Office)లో సోమవారం జరగబోయే రిప్లబిక్ వేడుకల్లో(Rpublic Day Celebrations) అతిథులకు ఏపీ హస్తకళారూపాలతో కూడిన గిఫ్ట్ బాక్స్‌(Gift Boxes)లు అందజేయనున్నారన్నారు. ఇందుకోసం సింగపూర్‌లోని ఇండియా హైకమిషన్.. లేపాక్షి అధికారులకు 400 గిఫ్ట్ బాక్స్‌లకు ఆర్డర్ పెట్టినట్లు తెలిపారు. అంతర్జాతీయంగా ఏపీ హస్తకళలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని విదేశాల్లో లేపాక్షి షో రూమ్‌లు తెరవనున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆమె ప్రకటన విడుదల చేశారు.

‘గతేడాది ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో ఏపీ హస్తకళల శకటానికి తృతీయ స్థానం వచ్చిన నాటి నుంచి హస్తకళారూపాలకు విపరీతమైన ప్రాచుర్యం లభించింది. దేశవ్యాప్తంగా ఏపీ హస్త కళారూపాల విక్రయాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో సింగపూర్‌‌లోని ఇండియా ఎంబసీ అధికారులు ఏపీ హస్తకళారూపాలతో కూడిన 400 గిఫ్ట్ బాక్సులు కావాలని లేపాక్షికి ఆర్డర్ ఇచ్చారు. ఈ గిఫ్ట్ బాక్స్‌లో సీతాదేవి లెదర్ పప్పెట్రీ, ఏనుగు ఆకారపు బ్యాగేజ్ ట్యాగ్, హ్యాండ్ పెయింటెడ్ ఏనుగు కోస్టర్ వంటి కళారూపాలు ఉంటాయి. ఏపీ హస్తకళలకు అంతర్జాతీయంగా గుర్తింపు రావడం హర్షణీయం’ అన్నారు.

- Advertisement -

విదేశాల్లోనూ లేపాక్షి షోరూమ్‌లు

‘ఏపీతోపాటు జాతీయ స్థాయిలో 19 లేపాక్షి షోరూమ్‌లు ఉన్నాయి. ఏపీ హస్తకళలకు అంతర్జాతీయంగా గుర్తింపు రావడంతో విదేశాల్లోనూ లేపాక్షి షోరూమ్‌లను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. హస్తకళాకారులకు ఆర్థిక భరోసా కలిగించేలా మార్కెటింగ్ పెంచాలని నిర్ణయించాం. ఇందులోభాగంగా మారుతున్న ప్రజల అభిరుచులకు అనుగుణంగా కళారూపాల తయారీలో కళాకారులకు శిక్షణ అందజేస్తున్నాం. నిత్యావసరాలు, వస్త్రాలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల మాదిరిగా హస్తకళారూపాలనూ ఆన్‌లైన్‌లో విక్రయించేలా ప్రత్యేక వెబ్‌సైట్ తయారుచేస్తున్నాం. ఆయా కళారూపాలను 10, 20, 30 శాతం డిస్కౌంట్లతో లేపాక్షి షోరూమ్‌ల్లో అమ్మకాలు చేస్తున్నాం.

ప్రస్తుత తరం ఆలోచనలు, అభిరుచులకు అనుగుణంగా లేపాక్షి షోరూమ్‌లను అభివృద్ధిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వినియోగదారులను ఆకట్టుకునేలా ఆ నిర్మాణాలు ఉంటాయి. తొలి విడతలో విశాఖపట్నం, అనంతపురం, కడప లేపాక్షి షోరూమ్‌లను అభివృద్ధిచేయనున్నాం. ఇందుకోసం ప్రభుత్వం ఒక్కో షో రూమ్‌కు రూ.15 లక్షల చొప్పున వెచ్చిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలోని లేపాక్షి షోరూమ్‌ను అభివృద్ధిచేశాం. మిగిలిన 15 షోరూమ్‌లను విడతల వారీగా అభివృద్ధి చేయనున్నాం. ఏపీ సంస్కృతి, సంప్రదాయాలకు హస్తకళలు ప్రతిరూపాలు. వాటిని పరిరక్షించుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం‘ అని మంత్రి సవిత వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News