Thursday, February 12, 2026
HomeజాతీయంRahul Gandhi | అమెరికాకు తలొగ్గిన భారత ప్రభుత్వం

Rahul Gandhi | అమెరికాకు తలొగ్గిన భారత ప్రభుత్వం

  • వాణిజ్య ఒప్పందంతో అమెరికాకే లాభం..
  • ఎన్స్టీన్ ఫైల్స్లో అనిల్ అంబానీ, హర్దీప్ పురిల ప్రస్తావన..
  • బడ్జెట్ చర్చలో రాహుల్ విమర్శలు..
  • రాహుల్ వ్యాఖ్యలపై గందరగోళం..

అమెరికా ప్రభుత్వానికి భారత్ తలొగ్గిందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇరు దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం అమెరికాకు మేలు కలిగించేలా ఉందే తప్ప.. భారత్ కు దీనివల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదన్నారు. కేంద్ర బడ్జెట్పై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ లోక్సభలో మాట్లాడారు. తన ప్రసంగంలో వాణిజ్య ఒప్పందంతో పాటు ఏఐ ప్రభావం వంటి అంశాల గురించి ప్రస్తావించారు.

ప్రపంచంలో మారుతున్న పరిణామాలకు అనుగుణంగా బడ్జెట్ ఏమాత్రం ప్రతిబింబించలేదన్నారు. ప్రపంచమంతా ఏఐ యుగంలోకి వెళ్తుందని చెబుతున్నారు. దీనివల్ల భారతీయ ఐటీ కంపెనీలు నష్టపోయే ప్రమాదం ఉంది. సాప్ట్వేర్ ఇంజినీర్ల ఉద్యోగాలకు ప్రమాదం ఉంది. మన దేశానికి ప్రతిభావంతులైన యువతరం పెద్ద ఆస్తి. ఏఐకి ఇంధనమే డేటా.. డేటా లేకుండా ఏఐ ఏమీ చేయలేదు. అమెరికా సూపర్ పవర్గా కొనసాగాలంటే భారత్ డేటానే కీలకం. గతంలో అధిక జనాభాను సమస్యగా భావించేవారు..

- Advertisement -

కానీ జనాభా మనకు అతిపెద్ద ఆస్తి. కానీ మన డేటాను రక్షించుకునేందుకు ఇండియా చర్యలు తీసుకోలేదు. అమెరికా కంపెనీల కోసం ట్యాక్స్ హాలిడే ప్రకటించిందని రాహుల్ గాంధీ అన్నారు. మన దేశం ఏ దేశాల నుంచి చమురు కొనుగోలు చేయాలో అమెరికా చెబుతోంది. వాళ్లు చెప్పినట్లు చేయకపోతే 50 శాతం టారిఫ్లు వేస్తామని బెదిరిస్తున్నారు. అమెరికా డిమాండ్లకు తలొగ్గి కీలక వ్యవసాయ ఉత్పత్తులకు భారత్ ద్వారాలు తెరిచింది. గతంలో భారత ఉత్పత్తులపై ఒకప్పుడు కేవలం 3 శాతం పన్ను ఉండేది. ఇప్పుడు అది 18 శాతానికి చేరింది.

అమెరికా దిగుమతులను 46 బిలియన్ డాలర్ల నుంచి 100 బిలియన్ డాలర్లకు పెంచేశారు. భారత్కు ఈ ఒప్పందం ఎలాంటి భరోసా ఇవ్వడం లేదు. డాలర్ను రక్షించుకునేందుకు ఈ ఒప్పందం దోహదపడుతోందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఎపి స్టీన్ ఫైల్లో ప్రముఖ పారిశ్రామికవేత్త అనీల్ అంబానీ పేరు వచ్చినా.. ఎందుకు జైలులో పెట్టలేదని లోక్సభ ప్రతిపక్షనేత రాహుల్గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

వ్యాపారవేత్త అనీల్ అంబానీ ఎందుకు జైలులో లేడని నేను అడగాలనుకుంటున్నాను? దీనికి కారణం ఆయన పేరు ఎప్లిన్ ఫైల్స్లో ఉంది. అతన్ని (అనీల్ అంబానీ) ఎప్టోస్టీన్ కు పరిచయం చేసిన హర్దీప్ పూరిని కూడా నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. అతన్ని ఎవరు పరిచయం చేశారో నాకు తెలుసు. హర్దీప్ పూరికి అతన్ని ఎవరు పరిచేశారో తెలుసు’ అని అన్నారు. పరోక్షంగా రాహుల్ మోడీనుద్దేశించి వ్యాఖ్యానించారు.

బ్జడెట్పై ప్రసంగం సందర్భంగా రాహుల్ గాంధీ ఎప్టోన్గా ల్స్ గురించి ప్రస్తావన తీసుకురాగా.. స్పీకర్ స్థానంలో ఉన్న జగదాంబికా పాల్ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా అదానీ, అనిల్ అంబానీ, హర్దీప్ సింగ్ పూరీ పేర్లను ప్రస్తావించడంపై రవిశంకర్ ప్రసాద్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. దీంతో రాహుల్ గాంధీ వ్యాఖ్యలను రికార్డులను తొలగించాలని స్పీకర్ ఆదేశించారు.

బ్జడెట్ గురించి మాత్రమే మాట్లాడాలని స్పీకర్ సూచించారు. పలుమార్లు రాహుల్ గాంధీ మాట్లాడేందుకు ప్రయత్నించగా.. అధికారపక్ష సభ్యుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అమెరికాకు తలొగ్గి డేటాను, వ్యవసాయాన్ని, ఇంధన రంగాన్ని అమ్మకానికి పెట్టారంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించి తన ప్రసంగాన్ని ముగించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News