Thursday, March 26, 2026
Homeఆరోగ్యంAwareness | పిలెప్సీ(మూర్ఛ)పై అపోహ‌ల‌ను తొల‌గించాలి.

Awareness | పిలెప్సీ(మూర్ఛ)పై అపోహ‌ల‌ను తొల‌గించాలి.

  • బాధితుల‌కు స‌మ‌గ్ర స‌హ‌కారం అందించాలి.

ఎపిలెప్సీ (మూర్ఛ) వ్యాధిపై సమాజంలో ఉన్న అపోహలను తొలగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్వ‌యంకృషి సంస్థ వ్యవస్థాపకురాలు డా. మంజులా కళ్యాణ్ పేర్కొన్నారు. మార్చి 26న‌ పర్పుల్ డే సందర్భంగా ఎపిలెప్సీపై అవగాహన పెంపొందించేందుకు సోమాజీగూడ ప్రెస్ క్ల‌బ్ లో గురువారం రోజు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా PurpleDay.org.in అనే ప్రత్యేక వెబ్ సైట్ (వేదిక‌) ను ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. ఈ వెబ్ సైట్ (వేదిక) ద్వారా ఎపిలెప్సీతో జీవిస్తున్న వ్యక్తులకు అవగాహన, విద్య, మద్దతు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.

దేశంలో ఈ వ్యాధి బాధితుల సంఖ్య అధికంగా ఉన్న నేపథ్యంలో, అపోహలను తొలగించడం, సరైన సమాచారం ప్రజలకు చేరవేయడం, సమయానికి వ్యాధి బాధితుల‌కు వైద్య సేవలు అందేలా ప్రోత్సహించడం వేదిక‌ ప్రధాన ఉద్దేశమని డాక్ట‌ర్ మంజులా క‌ళ్యాణ్ వివరించారు. ప్రభుత్వంతో పాటు వైద్య, విద్య, స్వచ్ఛంద మరియు కార్పొరేట్ రంగాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఎపిలెప్సీ బాధితుల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగేలా సమిష్టి చర్యలు చేప‌ట్ట‌డ‌మే ఈ కార్యక్రమ ముఖ్య‌ లక్ష్యమని ఆమె తెలిపారు.

- Advertisement -

ఎపిలెప్సీ బాధితులకు మరింత అవగాహన, సమగ్రత, మద్దతు కలిగిన వాతావరణాన్ని సృష్టించేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని డా. మంజులా కల్యాణ్ వెల్లడించారు. కార్య‌క్ర‌మంలో స్వ‌చ్ఛంధ సంస్థ స‌భ్యుల‌తో పాటు ప‌లువురు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News