పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ అధికారులు సూచించారు. ‘ప్రజా పాలన – ప్రజా ప్రణాళిక’ 99 రోజులు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నిర్మల్ పట్టణం తారక రామ్ నగర్లో అధికారులు పర్యటించి కాలనీలో ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ప్రజలచేత ప్రతిజ్ఞ చేయించారు. కార్య క్రమంలో షేక్ తాయెద్, లక్ష్మణ్ చిన్నయ్య నర్సింగరావు, సాయిబాబ, సంతోష్, హైమత్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
