Homeమహబూబ్‌నగర్‌BJP | బిజెపి పై ప్రజలలో విశ్వాసం పెరుగుతుంది.

BJP | బిజెపి పై ప్రజలలో విశ్వాసం పెరుగుతుంది.

  • జిల్లా అధ్యక్షులు దుప్పల్లి నారాయణ,
  • 5 వ వార్డు నుండి బీజేపీలోకి భారీగా చేరికలు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలతో బిజెపిపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుందని జిల్లా అధ్యక్షులు నారాయణ అన్నారు. ఆదివారం వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 5 వ వార్డు నుంచి జ్యోతి శంకర్ నాయక్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది ఎస్టీ యువతీ యువకులు, మహిళలు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరారనీ అన్నారు.

Massive Influx into BJP from Vanaparthy 5th Ward1

ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు డి. నారాయణ, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఆర్. లోకనాథ్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాధారంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, రాజశేఖర్ గౌడ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News