Homeమహబూబ్‌నగర్‌NTR | సంక్షేమ పథకాలకు ఆద్యులు నందమూరి తారక రామారావు.

NTR | సంక్షేమ పథకాలకు ఆద్యులు నందమూరి తారక రామారావు.

  • నందిమల్ల అశోక్ జిల్లా మీడియా కన్వీనర్ ..

సంక్షేమ పథకాలకు ఆద్యులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగు ప్రజల ఆశాజ్యోతి నందమూరి తారక రామారావు అని జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ అన్నారు. ఆదివారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్.టి.ఆర్ విగ్రహానికి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ తో కలసి ఆయన ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నందిమల్ల అశోక్ మాట్లాడుతూ .. సమాజమే దేవాలయం .. ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చి తెలుగువారీ ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుమూలల చాటిన మహనీయుడు ఎన్.టి.ఆర్ అని కొనియాడారు.

భారత రాజకీయాలలో సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్.టి.ఆర్ అని మహిళలకు ఆస్తిలో సమానహక్కు, రెండు రూపాయలకు కిలో బియ్యం, పక్కా ఇండ్ల నిర్మాణం, జనతా వస్త్రాలు, విద్యుత్తు హార్స్ పవర్ కు 50 రూపాయలు వంటి పథకాలు అందించి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఎన్.టి.ఆర్ పేరు తెలుగుజాతి ఉన్నంతవరకు చిరస్థాయిగా నిలుస్తుందని అన్నారు. భారతదేశ రాజకీయ చరిత్రలో ఇద్దరి పేర్లు స్థిర స్థాయిగా నిలిచిపోతాయి అని అందులో నందమూరి తారక రామారావు ఒకరైతే ఎన్.టి.ఆర్ కి మించి సంక్షేమ పథకాలు అమలు చేసిన కె.సి.ఆర్ దని అన్నారు. ఈ కార్యక్రమములో గంధం పరంజ్యోతి, బండారు కృష్ణ, ఉంగ్లం తిరుమల్, ఎం డి గౌస్, స్టార్ రహీమ్, డాక్టర్ డ్యానియల్, శ్రీకర్ గౌడ్, రామకృష్ణ, మన్నెం, సూరిబాబు, సురేందర్, ఇంతియాజ్, బాలాంజనేయులు తదితరులున్నారు.

- Advertisement -
Tributes to Nandamuri Taraka Rama Rao on Death Anniversary1

తెలుగు భాష గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు ఎన్టీఆర్.
నాగర్ కర్నూల్ పార్లమెంట్ కన్వీనర్ బి రాములు..

తెలుగు భాష గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అని నాగర్ కర్నూల్ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కన్వీనర్ బి రాములు అన్నారు. ఆదివారం ఎన్టీఆర్ 30 వ వర్ధంతి సందర్భంగా కమాన్ చౌరస్తాలో గల ఎన్టీఆర్ విగ్రహానికి, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గల విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ.. అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పాలనను అంతం చేస్తూ కేవలం 9 నెలల కాలంలోనే అధికారం చేపట్టి పేదలకు కూడు, గూడు ,గుడ్డ అనే నినాదాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.

Tributes to Nandamuri Taraka Rama Rao on Death Anniversary2

అన్ని రంగాల్లో మహిళలకు ప్రత్యేక స్థానం కల్పించి ఆస్తిలో హక్కును కల్పించిన మహా మనిషి అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వనపర్తి పట్టణ అధ్యక్షులు కె లక్ష్మయ్య, రాష్ట్ర నాయకులు సుధాకర్ నాయుడు, శాకీర్ హుస్సేన్, ఆవుల శ్రీను, కొత్త గొల్ల శంకర్, ఎండి దస్తగిరి, హోటల్ బలరాం, ఎండి గౌస్, మేదరి బాలయ్య, నాయకులు చిట్యాల బాలరాజు, నాయకులు గట్టు రాధాకృష్ణ, బాలయ్య ,బొట్టుమన్యం,B శేఖర్, ఉపేందర్, ఫారుఖ్, శివాచారి, రాజ మేస్త్రి, దాసు, కృష్ణయ్య, గిరి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News