Friday, February 13, 2026
Homeకరీంనగర్Protest | డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని పొర్లు దండాలు

Protest | డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని పొర్లు దండాలు

కరీంనగర్ స్మార్ట్ సిటీ పరిధిలోని మూడో డివిజన్ కిసాన్ నగర్ ప్రాంత అభివృద్ధి కోసం, డివిజన్ పరిధిలోని రోడ్లు ,డ్రైనేజీ ల సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం రోజున స్థానిక బిజెపి నేత సోమిడి వేణు ప్రసాద్ నిరసన కార్యక్రమం చేపట్టారు. కిసాన్ నగర్ బీడీ కంపెనీ నుండి మీ సేవ వరకు సోమిడి వేణు మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి అని పోర్లు దండాలు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమిడి వేణు మాట్లాడుతూ కిసాన్ నగర్ ప్రాంత అభివృద్ధి విషయంలో గత ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు.

జిల్లా అధికారులకు, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు అనేకమార్లు ఇక్కడి ప్రాంత అభివృద్ధి కోసం వినతి పత్రాలు సమర్పించిన సమస్యలను పరిష్కరించుదామన్న ఆలోచన చేయలేదన్నారు. డివిజన్ ప్రాంత ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. డివిజన్లో కనీస మౌలిక వసతులైన రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించకపోవడం దారుణం అన్నారు. వర్షాకాలంలో ఇక్కడి ప్రాంతంలోని రోడ్లు, మురికి కాలువల పరిస్థితి దారుణంగా మారి, రోడ్లన్నీ అస్తవ్యస్తంగా తయారవుతున్నాయన్నారు.

- Advertisement -

ఎన్నోమార్లు వినతి పత్రాలు సమర్పించిన ఫలితం లేకపోవడంతోనే , బిజెపి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ప్రజలు తీవ్రంగా ఇక్కడి ప్రాంతంలో ఎదుర్కొంటున్న ప్రధాన రోడ్లు, డ్రైనేజీ సమస్యలను ఇప్పటికైనా పరిష్కరించి డివిజన్ ప్రజలకు న్యాయం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో బిజెపి నాయకులు మెంగని రాజయ్య, బండిపల్లి సంజీవ్,గాలి సురేష్, కళ్యాణ్,సుమన్ చాడ ఆనంద్ మేకల సాయి, , కార్యకర్తలు, స్థానిక డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News