- సొంతూరు సైదాపురంలో బీఆర్ఎస్‌లోకి వంద మంది కాంగ్రెస్ శ్రేణులు
యాదగిరిగుట్ట, నవంబర్27 (ఆదాబ్ హైదరాబాద్): సర్పంచ్ ఎన్నికల (Sarpanch Elections) వేళ ఆలేరు ఎమ్మెల్యే (Aleru MLA) బీర్ల అయిలయ్య(Congress Party)కి భారీ షాక్ తగిలింది. ఆయన సొంతూరు సైదాపురం(Saidapuram)లోనే పరిస్థితి అడ్డం తిరిగింది. అయిలయ్య ప్రధాన అనుచరులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు వంద మంది దళితులు (Dalits) కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ(Brs Party)లోకి జంప్ చేశారు. వీరిలో.. పూలెపాక లావణ్య శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోత్కుపల్లి సుమలతా శ్రీకాంత్, పూలెపాక నిరీక్షణారని, పూలెపాక మల్లేశ్, వినయ్, మౌనికా మురళికృష్ణ, లక్ష్మి, కోట ప్రవీణ్‌తోపాటు మరో వంద మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
గురువారం పట్టణంలో గొంగిడి నిలయంలో ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి.. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు అమలుపరచడంతో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గడిచిన రెండేళ్ల కాలంలో ఆలేరు నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని మండిపడ్డారు.
పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరికే పరిస్థితి లేదని ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శ ఎద్దేవా చేశారు. ఆలేరు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలుపు లాంఛనమేనని తెలిపారు. పంచాయతీలపై గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, సైదాపురం గ్రామ శాఖ అధ్యక్షుడు నంద సిద్ధయ్య, మాజీ ఎంపీటీసీ బీర్ల మహేశ్, సీనియర్ నాయకులు మానుపాటి కృష్ణ, పూలెపాక అశోక్, గంధమల్ల కుమార్, కొలకొప్పుల శ్రీనివాస్, తోటకూరి మల్లేశ్, ఆహ్మాద్, కనుకుల సిద్ధారెడ్డి, గంధమల్ల మధు, పూలెపాక నరహరి, కాట పాండురంగారావు, ఎండీ మాలిక్ మహ్మద్, బీర్ల చంద్రయ్య, పల్లె సురేందర్, రాంపల్లి నాగరాజు, మహ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు.

