Thursday, February 12, 2026
Homeరంగారెడ్డిStudent Safety | ఫీజులపై ఉన్న శ్రద్ధ పిల్లల భద్రత పై లేదా..

Student Safety | ఫీజులపై ఉన్న శ్రద్ధ పిల్లల భద్రత పై లేదా..

  • విద్యార్థుల భద్రత విషయంలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల నిర్లక్ష్యం.
  • ఏటా ప్రమాదాలు జరుగుతున్నా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం.
  • కఠినంగా వ్యవహరించని ఆర్టీఏ, పోలీస్, అధికారులు విద్యాశాఖ అధికారులు.
  • ప్రమాదం జరిగితే గాని స్పందించరా అంటూ విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహం.

వికారాబాద్: విద్యార్థుల ప్రాణాలతో(Student Lives) ప్రైవెట్ స్కూల(Private school) యాజమాన్యం చెలగాటమాడుతుంది.అసలే గుంతల రోడ్లు(Pothole roads),రోజుకో ప్రమాదం ఇంత జరుగుతున్నా నిబంధనలు మాకు పట్టావనట్లు పరిమితికి మించి విద్యార్థులను ఆటోల్లో,బస్సులో ఎక్కిస్తూ పాఠశాలకు,ఇంటికి తరలిస్తునారు.ప్రవేట్ పాఠశాలను పెట్టుకునేందుకు అనుమతి ఇచ్చే సమయంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా పిల్లలకు భద్రత ఉందా లేదా అనేది విద్యా,ఆర్టీఏ శాఖల అధికారులు,పరిశీలన చేసి ఇవ్వాల్సి ఉంటుంది.కానీ వికారాబాద్ జిల్లాలో అవేం మాకు పట్టవు అన్నట్లు సాగుతుందనడానికి నిదర్శనం పైన ఆటోలో తీసుకెళ్తున్న విద్యార్థుల ఫొటో చూస్తేనే అర్థమవుతుంది.

ఇలా పరిమితికి మించి ప్రైవెట్ పాఠశాలలో చదివే విద్యార్థులను ఆటోలో, బస్సులో తీసుకెళ్లే సమయంలో జరగరానిది ఏదైనా జరిగితే ఆ బాధ్యత విద్యాసంస్థలదా? లేక విద్యాశాఖ అధికారులదా? అనే ప్రశ్నలు తల్లిదండ్రుల మదిలో తలెత్తుతున్నాయి.వాహనాల తనిఖీలు,టెస్టుల నిర్వహణలో మాత్రమే చురుకుగా కనిపించే పోలీస్ శాఖ అధికారులు ఇటువంటి పాఠశాలలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రం పరిసర ప్రాంతాలతో పాటు ధారూర్, మోమిన్ పేట్ నవాబ్ పేట్ మండలాల నుండి విద్యార్థిని,విద్యార్థులు వికారాబాద్ పట్టణంలోని ప్రైవెట్ పాఠశాలల్లో వేలాదిమంది చదువుతున్నారు.

- Advertisement -

రోజు సుమారు 20 నుండి 25 కిలోమీటర్లు వస్తూ వెళ్తు ఉంటారు.స్కూల్ యాజమాన్యం మాత్రం పరిమితికి మించి విద్యార్థులను బస్సులో, ఆటోలో ఎక్కించి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.పరిమితికి మించి ఎక్కువ విద్యార్థులను తరలించి గమ్య స్థానాలకు చేరుకుంటారో తెలియని పరిస్థితి.వికారాబాద్ పట్టణంలోని ప్రైవేట్ స్కూల్ జరుగుతుంది. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల యాజమాన్యం విద్యార్థుల ప్రాణాల పట్ల భద్రతా ఉల్లంఘనలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారులు మాత్రం మూగవైఖరి ఎంచుకోవడం పట్ల ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి.

చిన్నచితకా స్కూళ్లపై మాత్రం సీరియస్‌ అయి చర్యలు తీసుకుంటూ,కార్పొరేట్ విద్యాసంస్థల దురాగతాలపై కనీస స్పందన చూపించకపోవడం పలు విమర్శలకు దారి తీస్తోంది.పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడే పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ తల్లిదండ్రుల చేస్తున్నారు.విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంతో పిల్లల భవిష్యత్తు మాత్రమే కాదు,ప్రాణాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విధులు మరిచి వాణిజ్యరంగ హస్తాన్ని గౌరవించే విద్యాశాఖ చర్యలు తీసుకోవాలంటే, ఏదైనా ఘటన జరిగాక స్పందించాల్సిన అవసరం ఉందా? అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతుంది.ఇలా ప్రైవెట్ స్కూల్ నిబంధనలు పాటించకుండా విద్యరుల జీవితాలతో చాలగాటం ఆడుతున్నా కూడ ఆర్టీఏ అధికారులు కానీ విద్యాశాఖ అధికారులు కానీ చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారని తెలుస్తుంది.కార్పొరేట్ స్కూళ్ల పెత్తందారీ ధోరణి ఎంత వరకూ కొనసాగుతుందో? అనేది చూడాల్సిందే

- Advertisement -
RELATED ARTICLES

Latest News