Wednesday, January 14, 2026
EPAPER
Homeఆదాబ్ ప్రత్యేకంHydraa | హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతలు

Hydraa | హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతలు

‘ఆదాబ్’ కథనానికి అధికారుల స్పందన

అమీన్‌పూర్ (Ameenpur) పట్టా స్వర్వే నంబర్ వేసి దస్తావేజులు సృష్టించి… ఆపైగా అక్రమ LRS పత్రాలను సమర్పించి అమీన్ పూర్ మున్సిపల్ నుండి అనుమతి పొంది… మియాపూర్ ప్రభుత్వ సర్వే నంబర్ 100,101 లో నిర్మిస్తున్న భవనాన్ని ఈ రోజు హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టడం హర్షించదగ్గ విషయం. కానీ.. అనుమతులు జారీ చేసిన అధికారులపై చర్యలు ఎప్పుడు?. అక్రమ దస్తావేజులు, నకిలీ LRS పత్రాలను చూసి అమీన్ పూర్ మున్సిపల్ (Municipal) అనుమతిని జారీ చేసిన అధికారులు అమాయకులా? లేక అక్రమార్కులకు సహకరించారా?. భవనం ఈ స్థాయికి చేరుకునే వరకు చూసీ చూడనట్లు వ్యవహరించిన టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులపై విచారణ ఎందుకు జరగడం లేదు?

- Advertisement -
Ameenpurలోని ప్రభుత్వ స్థలంలో నిర్మించిన భవనంపై ఆదాబ్ హైదరాబాద్ ప్రచురించిన కథనం

కూల్చివేతలు (Demolitions) కేవలం నామమాత్రమేనా? అక్రమాల మూలాలను, అంటే అనుమతులు ఇచ్చిన పెద్ద తలలను ఎప్పుడు పట్టుకుంటారు? అక్రమ దస్తావేజుల రద్దు మరియు అక్రమార్కులపై చర్యలు ఎప్పుడు? అమీన్ పూర్ పట్టా సర్వే నంబర్ వేసి సృష్టించిన ఆ నకిలీ దస్తావేజుల(Fake Documents)ను రిజిస్ట్రేషన్ శాఖ ఎప్పుడు రద్దు చేస్తుంది? ప్రభుత్వ భూమిని అక్రమంగా కాజేయడానికి ప్రయత్నించిన నిర్మాణదారులపై, దానికి సహకరించిన మధ్యవర్తులపై క్రిమినల్ కేసులు (Criminal Cases) నమోదు చేసి…. అరెస్టు చేయడం లో పోలీస్ అధికారుల ఆలస్యం ఎందుకు ?”

కేవలం నిర్మాణాన్ని కూల్చివేస్తే సరిపోతుందా? అధికారుల-అక్రమార్కులపై పూర్తి స్థాయి విచారణ జరిపే ధైర్యం ప్రభుత్వానికి ఉందా? స్థానికుల నుండి ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్ కూల్చివేతలు కేవలం కంటి తుడుపు చర్యలు కాకూడదు. అనుమతులు జారీ చేసిన అధికారులు, వారికి సహకరించిన వారందరిపైనా కూడా తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అక్రమ దస్తావేజులను వెంటనే రద్దు చేయాలి. లేని పక్షంలో, అక్రమ భవనాలకు పునాది వేసిన వారే, భవిష్యత్తులోనూ యథేచ్ఛగా ఇదే పని చేస్తారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News