Homeమహబూబ్‌నగర్‌Peddagudem | అభివృద్ధి చేశాం ఆదరించండి.

Peddagudem | అభివృద్ధి చేశాం ఆదరించండి.

  • కాంగ్రెస్ పార్టీ మాయమాటలకు మరోసారి మోసపోకండి..
  • పెద్దగూడెం సర్పంచ్ అభ్యర్థి చిరంజీవి పుష్పలత..

పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో పెద్దగూడెం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని మరోసారి ఆదరించి గ్రామ అభివృద్ధి కొనసాగే విధంగా ఆలోచించి ఓటు వేయాలని పెద్దగూడెం గ్రామ సర్పంచి అభ్యర్థి చిరంజీవి పుష్పలత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం సర్పంచ్ ఎన్నికలో భాగంగా గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి పుష్పలత మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాయకుల మోసపూరీత మాటలకు మరోసారి మోసపోవద్దని, కెసిఆర్ పై అసత్యపు ప్రచారాలు, 6 గ్యారంటీలు 420 అబద్దపు హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్న హామీలు నెరవేర్చడంలో విఫలమైందని అన్నారు.

Chiranjeevi Pushpalatha Appeals to Peddagudem Voters for Continued Development 1

కళ్యాణ లక్ష్మి తో పాటు తులం బంగారం, రైతు బీమా, రైతు భరోసా, 500 బోనస్, పెన్షన్లు వంటి సంక్షేమ పథకాలకు కోతలతో ప్రభుత్వం కాలం గడుపుతూ అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందని దుయ్యబట్టారు. గ్రామాల అభివృద్ధి చెందాలంటే మళ్ళీ కేసీఆర్ పాలన రావాలని ఆకాంక్షించారు. గ్రామస్థాయిలో టిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి రాబోయే రెండేళ్ల కాలంలో పార్టీని అధికారం లోకి తీసుకురావడానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, గ్రామ అధ్యక్షులు, మాజీ సర్పంచ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News