Tuesday, February 10, 2026
Homeమెదక్‌Panugatla Srinivas Goud | నమ్మిన ప్రజలకు న్యాయం చేస్తా

Panugatla Srinivas Goud | నమ్మిన ప్రజలకు న్యాయం చేస్తా

  • ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తా
  • గ్రామస్తుల కృషి వల్లే అధికారంలోకి వచ్చా
  • ఎల్లవేళలా గ్రామస్తులకు తోడుగా ఉంటా
  • ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న
  • సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పనుగట్ల శ్రీనివాస్ గౌడ్

నమ్మిన ప్రజలకు న్యాయం చేస్తానని ఎన్నికల సమయంలో గ్రామస్తులకు ఇచ్చిన హామీలు అన్నీ గుర్తుకున్నాయని వాటిని నెరవేర్చడమే నా జీవిత కర్తవ్యం అని జగదేవపూర్ గ్రామ సర్పంచ్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు పనుగట్ల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం జగదేవ్ పూర్ గ్రామంలో అన్ని విధుల గుండా తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.కొన్ని రోజుల క్రితం వైద్య శాల, సబ్ స్టేషన్ సందర్శించారు. 6,7,8 వార్డుల్లో నీటి సమస్య ఉందని కాలనీవాసులు తెలుపడం తో వెంటనే వార్డుల్లో తన సొంత ఖర్చులతో బోరు మోటారుని బాగు చేయించి నీటి నీ సరఫరా చేయించారు.

అనంతరం మండల వనరుల కేంద్రంలోనీ చదువుతున్న పిల్లలను చూసి వారితో కాస్సేపు ముచ్చటించి వారి విద్య, ఆహారం పై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకుని పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే తనకు తెలుపాలని ముఖ్యంగా విద్యార్థుల భవిషత్తు చదువుతో నే ముడిపడి ఉంది కనుక వారికి మంచి విద్యా నందించాలని చెప్పారు.సందర్శించిన సమయంలో ఒక్కసారిగి అక్కడున్న కోతులను చూసి చలించిపోయారూ. విద్యార్థులకు ఎలాంటి ప్రాణాయపాయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత తనదేనని భావించి ఆయన వెంట ఉన్న వారితో చర్చించి వాటిని ఎలాగైనా గ్రామంనుడి తరిమేయాలనే ఆలోచనతో బుధవారం రోజున జగదేవపూర్ మండల కేంద్రంలోని స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కొబ్బరి కాయ కొట్టి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

- Advertisement -

ఆ భగవంతునితో వాటిని పట్టే క్రమంలో ఎవరికీ ఎలాంటి అపాయాలు కలుగకుండా చూడు దేవుడా అంటూ మొక్కినట్లు తెలిపారు .వారు గ్రామానికి చేస్తున్న సేవలు చూస్తున్న గ్రామస్తుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు తనకు అన్నీ గుర్తుకున్నాయని ఒక్కొక్కటిగా వాటిని నెరవేరుస్తానని అన్నారు. వారి వెంట గ్రామ ఉప సర్పంచ్ మచ్చ గణేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు బుద్ద నాగరాజు, దాచారం కనకయ్య, తదితరులు ఉన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News