తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు (President of Telangana State Gowda Association) పల్లె లక్ష్మణరావు గౌడ్ (Palle Laxmanrao Goud) మహబూబ్‌నగర్ (Mahaboobnagar) జిల్లా ఏనుగొండలోని శ్రీశ్రీశ్రీ కంఠమహేశ్వర స్వామి-సురమాంబ శిల విగ్రహ స్థిర ప్రతిష్ట, వనం మైసమ్మల గౌడ కుల దేవతల విగ్రహ ప్రతిష్ట, కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. మహబూబ్‌నగర్ మునిసిపల్ మాజీ చైర్మన్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ ఆహ్వానం మేరకు హాజరయ్యారు.

ఈ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యురాలు (MP) డీకే అరుణ (DK Aruna), తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షుడు డి.ఆనంద్ గౌడ్, రాష్ట్ర గౌడ సంఘం కార్యదర్శి టి.సుదర్శన్ గౌడ్, జిల్లా కమిటీ వైస్ ప్రెసిడెంట్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
