Saturday, February 21, 2026
Homeహైదరాబాద్‌OU JAC | ఓయూ సీఐ ని కలిసిన ఓయూ జెఏసి ఛైర్మన్ కొత్తపల్లి తిరుపతి

OU JAC | ఓయూ సీఐ ని కలిసిన ఓయూ జెఏసి ఛైర్మన్ కొత్తపల్లి తిరుపతి

ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ నూతన సీఐ గా పదవి బాధ్యతలు చేపట్టిన మాదగాని మహేష్ గౌడ్ ను గురువారం ఓయూ జేఏసి చైర్మన్ కొత్తపల్లి తిరుపతి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ మేరకు సిఐ కి పండ్లు ఇచ్చి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణకు ఎప్పటికప్పుడు నిఘా పెంచుతూ అసాంఘీయ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేలా ప్రత్యేక చర్యలు చేపడుతామన్నారు.

కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు విద్యార్థి నాయకులుగా తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు.ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు శ్రీనివాస్,చరణ్,రాజేందర్,రమేష్,శివాజీ,అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News