HomeఫోటోలుOo Torture Prema | "ఓ టార్చర్ ప్రేమ" చిత్రం ఫస్ట్ లుక్ విడుదల

Oo Torture Prema | “ఓ టార్చర్ ప్రేమ” చిత్రం ఫస్ట్ లుక్ విడుదల

శ్రీకరం ప్రొడక్షన్స్ పతాకం పై శ్రీకర్ కృష్ణ స్వయదర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం “ఓ టార్చర్ ప్రేమ”. ఈ చిత్రం లో మాదాల రంగారావు గారి మనవడు మాదాల రవి గారి అబ్బాయి సన్నీ మాదాల హీరోగా, మౌనిక డాకోజు హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. అయితే ఈరోజు ఈ చిత్రం యొక్క మొదటి టైటిల్ పోస్టర్ ని ప్రముఖ రచయిత, దర్శకుడు డాక్టర్ పరచూరి గోపాల కృష్ణ గారు విడుదల చేసారు.

O Torture Prema First Look Poster Released4

అనంతరం పరచూరి గోపాల కృష్ణ గారు మాట్లాడుతూ “మా మాదాల రంగారావు గారి మనవడు, మాదాల రవి కుమారుడు మూడోతరం హీరో సన్నీ మాదాల హీరో గా పరిచయం అవుతున్నాడు. తాత మార్గం, తండ్రి మార్గం విప్లవం అయితే మూడోతరం హీరో సన్నీ మాదాల ప్రేమ మార్గం ని ఎన్నుకున్నాడు. “ఓ టార్చర్ ప్రేమ” అనే అద్భుతమైన ప్రేమ కథ చిత్రం తో వస్తున్నాడు. రచన దర్శకత్వం అనేది మేము చాలా చిత్రాలకి వహించాము, కానీ దర్శకుడు శ్రీకర్ కృష్ణ మన దాసరి నారాయణ రావు గారి రీతిలో రచన, దర్శకత్వం తో పాటు నిర్మాణం కూడా అందించాడు. ఈ చిత్రం విజయవంతం కావాలి అని కోరుకున్నారు.

- Advertisement -
O Torture Prema First Look Poster Released01

దర్శకుడు శ్రీకర్ కృష్ణ మాట్లాడుతూ “ఇది ఒక మంచి ప్రేమకథా చిత్రం. ఈ చిత్రం లో నవ్వులు చిందించే సన్నివేశాలతో పాటు ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదల చేస్తాం” అని తెలిపారు.

O Torture Prema First Look Poster Released3

చిత్రం పేరు : ఓ టార్చర్ ప్రేమ
బ్యానర్ : శ్రీకరం ప్రొడక్షన్స్

O Torture Prema First Look Poster Released2

నటి నటులు : సన్నీ మాదాల, మౌనిక డాకోజు, రాజీవ్ కనకాల, శ్రీనివాస్, శ్రీవాణి, జబర్దస్త్ రోహిణి, నాగి, సిద్ధర్థ్ వర్మ, విష్ణు ప్రియా, యాదమ్మ రాజు, తదితరులు.

O Torture Prema First Look Poster Released

రచన, నిర్మాత, దర్శకుడు: శ్రీకర్ కృష్ణ
డి ఓ పి: సామి
ఎడిటర్: ప్రతీక్ నూటి
సంగీతం: ఇషాక్ వలి

- Advertisement -
RELATED ARTICLES

Latest News