Wednesday, February 11, 2026
Homeరంగారెడ్డిYellampet | ఎల్లంపేట మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం

Yellampet | ఎల్లంపేట మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం

ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలో ఉన్న నూతనకల్ గ్రామంలో ఓటర్ లిస్టులో అభ్యంతరాలు వున్నాయి అని నూతన కల్ గ్రామ నాయకులు అన్నారు,సోమవారం కమిషనర్ స్వామి నాయక్ ను మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించిన నాయకులు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనకల్ గ్రామంలో దాదాపుగా 2000 వరకు ఓటర్స్ కలరు అని ఒకే గ్రామం ఓట్లను మైసి రెడ్డి పల్లి కొనయపల్లెకు కొన్ని ఓట్లను లింగాపూర్ బర్మాజిగూడంకు కొన్ని ఓట్లను మరియు నూతనకల్ ఎస్సీ కాలనీ పూర్తిగా శ్రీరంగవరం గ్రామానికి కలపడం వలన గ్రామస్తులు అందరూ పూర్తిగా ఇబ్బందికి గురి అవుతున్నారు.

అని తెలిపారు, ఒకే గ్రామాన్ని నాలుగు గ్రామాలకు కలపకుండా ఒకే గ్రామంలో రెండు వార్డులు చేయాలని సరిపోను ఓట్లు ఉన్నవి కావున ఓటర్ లిస్టులో మార్పు చేసి నూతనకల్ ను పూర్తిగా రెండు వార్డులుగా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డబిల్ పూర్ మాజీ పి ఏ సి ఎస్ చైర్మన్ సద్ది సురేష్ రెడ్డి, నూతన్ కల్ మాజీ సర్పంచ్ చిన్నోళ్ల కవిత జీవన్, మేడ్చల్ మండల మాజీ కో ఆప్షన్ సభ్యులు యూనిస్ పాషా,బి ఆర్ ఎస్ పార్టీ ప్రెసిడెంట్ చిన్నోళ్ల భాస్కర్, మాజీ వార్డు సభ్యులు తలారి భూషణం పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News