- ప్రకటించిన ఎన్.టి.ఏ.
- అభ్యర్థుల ఆందోళన..
పోటీ పరీక్షల జవాబులపై అభ్యంతరం చెప్పే ప్రక్రియలో అభ్యర్థులు ప్రతి ప్రశ్నకు రూ. 200 చెల్లించాలని ఇటీవల ఎన్‌టీఏ ప్రకటించింది. దీనిపై విద్యార్థుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఎన్‌టీఏ స్పందించింది. ఆన్సర్ కీపై సవాలు చేయడానికి వసూలు చేసే రుసుము చాలా ఖరీదైనది అని అభ్యర్థులు ఆందోళన వెలిబుచ్చతున్నారు. దీనిపై స్పందించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలిపే విద్యార్థి కోసమే కాకుండా అభ్యర్థులందరికీ ఉన్న నిజమైన సందేహాలను సరిదిద్దేందుకే రుసుము వసూలు చేస్తున్నామని వివరణ ఇచ్చింది. ఒక అభ్యర్థి ఒక ప్రశ్నపై అభ్యంతరం చెబితే, దాన్ని సబ్జెక్ట్ నిపుణులు సరైనదని భావిస్తే సవరించిన జవాబు కీ పరీక్షకు హాజరైన అభ్యర్థులందరికీ వర్తిస్తుందని ఎన్‌టీఏ వెల్లడించింది.
