- ఏసీబీకి పట్టుబడిన ఎస్ఐ తీగల అశోక్
నిర్మల్ జిల్లాలో మరో అవినీతి చేప ఏసీబీకి పట్టుబడింది. నిర్మల్ జిల్లా మామడ ఎస్ఐ తీగల అశోక్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ సందర్భంగా ఏసిబి డిఎస్పి మధు మాట్లాడుతూ మండలానికి చెందిన ఓ వ్యక్తి స్థిరాస్తి వ్యవహారంలో చీటింగ్ కేసు నుండి తప్పించడానికి మామడ ఎస్సై అశోక్ 40 వేల రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు వివరించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లోని క్వార్టర్లో మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో 20 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు వివరించారు. ఎస్సై అశోక్‌ను అదుపులోకి తీసుకొని కరీంనగర్ లోని ఏసీబీ కోర్టులో హాజరు పరిజనున్నట్లు ఏసీబీ డి.ఎస్.పి తెలిపారు.
- Advertisement -
