Homeమహబూబ్‌నగర్‌Unbiased Development | తారతమ్యం లేకుండా అభివృద్ధి చేశాం.

Unbiased Development | తారతమ్యం లేకుండా అభివృద్ధి చేశాం.

  • మాజీమంత్రి నిరంజన్ రెడ్డి..

తన, మన అనే తారతమ్యం లేకుండా ఘనపురం మండలం కేంద్రాన్ని అభివృద్ధి చేశామని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఘనపురం మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం రాళ్ళ కృష్ణయ్య అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ఘనపురం మండలం కేంద్రాన్ని కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేశామని, అభివృద్ధి ద్యేయంగా తన, మన తారతమ్యం లేకుండా పని చేశామని ఓటు అడిగే నైతిక హక్కు మనకే ఉందని స్పష్టం చేశారు.

Niranjan Reddy on Development in Ghanapuram Mandal

కెసిఆర్ కి మించిన సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఓట్లు అడిగే కాంగ్రెస్ నాయకులను రైతులకు రైతు భరోసా ఏదని, మహిళకు 2500, ఆసరా పింఛన్లు 4000, తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు, ధాన్యానికి బోనస్, కెసిఆర్ కిట్టు, కంటివెలుగు, బతుకమ్మ పండుగ చీరలు ఏవని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశములో మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News