Sunday, April 19, 2026
Homeఎన్‌.ఆర్‌.ఐWorking Group | ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం కొత్త కార్యవర్గం

Working Group | ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం కొత్త కార్యవర్గం

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(TANTEX) కొత్త కార్యవర్గం కొలువైంది. 2026కి సంబంధించి నూతన అధ్యక్షురాలి(New President)గా లోకిరెడ్డి మాధవి(Lokireddy Madhavi) బాధ్యతలు స్వీకరించారు. ఆమె స్వస్థలం ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలు. గవర్నింగ్ బోర్డ్ మీటింగ్(Governing Board Meeting) గత ఆదివారం డాలస్‌లో నిర్వహించి ఈ వర్కింగ్ గ్రూప్‌ను ప్రకటించారు. ఈ సంఘాన్ని 1986లో స్థాపించారు. ప్రస్తుతం 40వ వార్షికోవత్సవాన్ని(Anniversary) జరుపుకుంటున్న ఈ అసోసియేషన్(Association).. తెలుగు భాష(Telugu Language), సాంస్కృతిక రంగాలకు ప్రాధాన్యత ఇవ్వటం లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త కార్యవర్గానికి ఉపాధ్యక్షుడిగా సునిల్, కార్యదర్శిగా కోయా, కోశాధికారిగా దీప్తి, సహాయ కార్యదర్శిగా వీర లెనిన్, సహాయ కోశాధికారిగా లక్ష్మీనరసింహ, ఉత్తరాధ్యక్షుడిగా ఉదయ్ కిరణ్ వ్యవహరించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News