Tuesday, February 10, 2026
Homeకరీంనగర్Road Safety | దృష్టి లోపం లేని డ్రైవర్లతోనే సురక్షిత ప్రయాణం

Road Safety | దృష్టి లోపం లేని డ్రైవర్లతోనే సురక్షిత ప్రయాణం

  • కరీంనగర్ రవాణాశాఖ డిప్యూటి ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పి.పురుషోత్తం

జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు 2026 లో 4వ రోజు కార్యక్రమం లో భాగం గా జిల్లా రవాణాశాఖ కరీం నగర్,ఆవరణలో,ఆధ్వర్యం లో 200 మంది డ్రైవర్ల కు సి.పి.ఆర్ శిక్షణ తో పాటు ఉచిత కంటి పరీక్షల తో పాటు జనరల్ చెకప్ పరీక్షల శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. నేడు సమాజం లో డ్రైవర్ల తో పాటు అనేకమంది ప్రజలు అకస్మాత్తు గా గుండె ఆగిపోయి మరణిస్తున్న నేపధ్యం లో సి.పి.ఆర్ ద్వార వారి ప్రాణాల ను కాపాడవచ్చని, ఆ ప్రక్రియ కు సంబంధించిన విధి విధానాల ను తిమ్మాపూర్ పి.హెచ్.సి డాక్టర్ ప్రణవ్ గారు సోదాహరణంగా డ్రైవర్ల కు వివరించారు.

ఈ కార్య క్రమాన్ని ఉద్దేశించి కరీం నగర్ రవాణాశాఖ డిప్యూటి ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పి.పురుషోత్తం మాట్లాడుతూ ఆరోగ్య వంతమైన ,
ఎలాంటి దృష్టి లోపం లేని డ్రైవర్ల తోనే భద్రత తో కూడిన రహదారి ప్రయాణం సాధ్యమౌతుందని చెప్పారు. ఈ కార్యక్రమం లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట రమణ గారి ఆదేశాల మేరకు డాక్టర్ పుల్లారావు ,డాక్టర్ ఉపేందర్, యమ్.యల్.హెచ్.
పి కుమార్, ఆప్తాల్మిక్ ఆఫీసర్ సురేష్ లతో పాటు ఏ.యన్.యమ్ లు,ఆయాల తోడ్పాటు తో
ఈ కార్య క్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు.

- Advertisement -

ఈ కార్యక్రమం లో డి.టి.ఓ శ్రీకాంత్ చక్ర వర్తి, యమ్.వి.ఐ. లు రవి కుమార్, నాగలక్మి, కవిత, ఏ.యమ్. వి.ఐ. లు స్రవంతి, హరిత సురేష్ , రవాణాశాఖ సిబ్బంది,ఆర్.అండ్. డి.ఇ కిరణ్, రక్షణ రోడ్ సేఫ్టీ ఫౌండేషన్ కో ఆర్డి నేటర్ డాక్టర్ నీలం సంపత్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News