మన దేశ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు(1949 నవంబర్ 26)కు గుర్తుగా ఈ రోజు దేశవ్యాప్తంగా జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్లమెంట్ పాత భవనం (Parliament Old Building) (సంవిధాన్ సదన్-Samvidhan Sadan)లోని చారిత్రక సెంట్రల్ హాల్(Central Hall)లో ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. ఈ వార్షికోత్సవంలో రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ము (Droupadi Murmu), ఉపరాష్ట్రపతి(Vice President) రాధాకృష్ణన్ (RadhaKrishnan), ప్రధాని మోదీ(PM Modi), లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ ప్రవేశికను సామూహికంగా పఠించారు. 9 భాషల్లోకి (తెలుగు, మలయాళం, మరాఠీ, నేపాలీ, పంజాబీ, బోడో, కశ్మీరీ, ఒడియా, అస్సామీ) ట్రాన్స్‌లేట్ చేసిన రాజ్యాంగ ప్రతులను రిలీజ్ చేశారు.
