HomeజాతీయంNational Bird Day | స్వేచ్ఛకు చిహ్నాలు వన్య పక్షులు..

National Bird Day | స్వేచ్ఛకు చిహ్నాలు వన్య పక్షులు..

  • పక్షులను కాపాడితే.. ప్రకృతి కాపాడినట్టే…
  • దత్తతతో పక్షుల సంరక్షణ.. నేహ్రు జూపార్కు ప్రత్యేకత
  • నేడే జాతీయ పక్షీ దినోత్సం…

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం జరుపుకునే జాతీయ పక్షి దినోత్సవం పక్షుల అదం. వాటి ప్రాముఖ్యతను ప్రజలకు గుర్తు చేసే ప్రత్యేక దినంగా నిలుస్తోది. వేగంగా మారుతున్న జీవనశైలి, పట్టణీకరణ కారణంగా పక్షుల నివాస ప్రాంతాలు నశించిపోతున్న నేపథ్యంలో ఈ దినోత్సవం మరింత ప్రాధాన్యం ఏర్పడిరది. ఇది పక్షల నివాస ప్రాంతాలను సంరక్షించుకోవాలని అంతరించి పోతు న్నా పక్షి జాతులను రక్షించాలని ప్రజలకు గుర్తుచేస్తుంది.

అలాగే ఈ రోజు వన్యప్రాణి సంరక్షణపై అవగాహన పెంచి ప్రకృతిలో పక్షులను గమనించడానికి ప్రేమించడానికి ప్రజలను ప్రోత్స హిస్తుంది. హైదరాబాద్ నేహ్రు జంతువు ప్రదర్శనశాల పక్షుల కీలకీల రాగాల సందడితో కళకళలాడింది. వివిధ దేశాల ప్రాంతా లకు చెందిన అరుదైన పక్షులను సందర్శకులు ఆసక్తిగా విక్రీస్తు న్నారు. రంగురంగుల రెక్కలతో విహారిస్తున్న పక్షుల. జంతువు ప్రేమికుల మనసుదోచు కుంటున్న నేపథ్యంలో జాతీయ పక్షీ దినం సందర్భంగా ఆదాబ్ పాఠకులకు అందిస్తున్న ప్రత్యేక కథనం…!!

- Advertisement -
National Bird Day at Nehru Zoological Park 1

ఆరంభ ఇలా….!!

జాతీయ పక్షి దినోత్సం ప్రతి సంవత్సరం జనవరి 5నాడు జరుపుకుంటారు.ఇదిమన ఈకోసిస్టమ్లో పక్షలు ప్రాధాన్యం మరియు సంరక్షణపై జాగ్రత పెంచడానికి అంకితం చేయబడిన రోజు. ఈరోజు ప్రజలందరు పక్షుల సౌందర్యం, వైవిధ్యం.వాటి ప్రాముఖ్యతను అభినందించడానికి ప్రేరేపిస్తుంది.దీనిని మూలం 2002లో ఆమెరికా ఏవియన్ వెల్ఫర్ కోలిషన్ ద్వారా ప్రారంభించ బడిరది. మన భారధేశంలో జాతీయ పక్షీ దినం ఇలా ఆరంభమైంది.

భారత పక్షిశాస్త్ర పితామహుడుగా పేరుగాంచిన సలీంఆలీ గారి జయంతిని పురుస్కరించుకుని జాతీయ పక్షీ దినోత్సవంగా జరుపుకుంటారు. కష్టపడి పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త డాక్టర్ సలీం ఆలీ విభజనకు ముందు ఉన్న భారతదేశంలోని ధూరమైన ప్రాంతలు మైదనాలు కోండలు, అన్ని తిరుగుతు ఆసియా పక్షుల ఇప్పటి వరకు వెలుగులోకి రాని ప్రపంచాన్ని వెలికి తీయడానికి తనజీవితాన్ని అంకితంచేశారు.

National Bird Day at Nehru Zoological Park0

పక్షుల సంరక్షణకే లక్ష్యంగా జూపార్కు చర్యలు…!!

పక్షుల సంరక్షణకే లక్ష్యంగా హైదరాబాద్ నగరంలోని నేహ్రు జూపార్కు అధికారులు అనేక చర్యలు చేపడుతున్నారు. గాయపడిన అనాథగా మిగిలిన పక్షలకు ప్రత్యేక సంరక్ష ణ కేంద్రాలు ఏర్పాటుచేసి వైద్య చికిత్స అంది స్తున్నారు. అంతేకాకుండా పక్షుల దత్తత కార్యక్రమం ద్వారా ప్రజలను సంరక్ష ణలో భాగస్వాములుగా చేయడానికి ప్రయ త్నిస్తు న్నారు. దత్తత తీసుకున్న పక్షుల పోషణ, సంరక్షణకు కావాల్సిన వనరులను జూపార్కు సమకూరు స్తుంది.

జాతీయ పక్షీ దినోత్సవం పక్షుల నివాస ప్రాంతాలను కాపాడు కోవాల్సిన అవసరాన్ని అంతరించి పోతున్నా పక్షిజాతు లను రక్షిం చాల్సిన బాధ్యతను ప్రజలకు గుర్తుచేస్తోంది. అలాగే వన్యప్రాణి సంరక్షణపై అవగాహాన పెంచి ప్రకృతిలో పక్షులను గమనించడం ప్రేమించడం వంటి విలువలను పెంపోందిస్తుంది. పక్షులను కాపా డుకోవడం అంటే ప్రకృతికి కాపాడుకోవడమూనని నేహ్రు జంతు ప్రదర్శనలోని ఈ ప్రయత్నాలు స్పష్టంగా తెలియ జేస్తున్నాయి.

పెంపుడు జంతువులతోపాటు నేమళ్ల, చిలుకలు, పిచ్చుకలు, కోకిల కాకులు వడ్రంగిపిట్టలు, గద్దలు, డేగలు, తదితర పక్షులు జీవన పరిణామ క్రమంలో మానవజీవితాల్లో మనుషుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించుకున్నాయి. కానీ పర్యావరణ వ్యవస్థల మార్పులతో దుదదృష్టవశాత్తు చాల పక్షులు అంతరించి పోతు న్నాయి. దీనికి కారణం నశించిపోతున్న ఆడవుల, సెల్దవర్ల రెడి యెషన్ ప్రభావం. ప్లాస్టిక్ అధికంగా వాడకం వల్ల పిచ్చుకలు పూర్తి గా కనుమరగవుతున్నాయి. వీటికి తోడు చట్టవిరుద్ధంగా జంతువు లు, పక్షుల వ్యాపారంకారణంగా మరింత ప్రమాదంకలుగుతోంది. వాస్తవానికి నేటి పిల్లలకు చాల పక్షులు పిట్టల పేర్లు తెలియవు.

పక్షుల్లో కోన్ని ఆరుదైన రకాలు…

రోసింగ్ కిట్, గ్రేహారన్బిల్, లాటీనో కాక్టెయిల్, పికాక్, రామచిలక, సారస్ క్రేన్, ఇండియన్ పీఫోల్, మ్యూట్స్వాన్, బ్లాక్ స్వాన్, రెడ్ంగీల్ఫోల్, హిమాలి యన్ గ్రీఫ్న్, ఆరుదైన రకాల పక్షులు జూపార్కులో ఉన్నాయి. పక్షులను దత్తతను దామర సురేఖ, ఎస్.ఎస్, రాంజీ, తోపాటు ఇతరులు తీసుకున్నారు. నేహ్రు జూపార్కు క్యూరేటర్ జే.వసంతా ఐ.ఎఫ్.ఎస్…!! అంతరించి పోతున్న పక్షుల్ని కాపాడుకునేందుకు వన్య పక్షుల అవసరం, ఉనికిపై ప్రజలకు అవగాహాన కల్పించే లక్ష్యంతో ప్రతి ఏడాది జనవరి 5న జాతీయ పక్షి దినం పాటిస్తాం. పక్షులు మన ప్రకృతిలో ఒకభాగం వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైఉంది.

అంతరించి పోతున్న పక్షులను జాపార్కులో ఉంచి వాటి మనుగడను కాపాడు తున్నాం. వీటితో పాటు పక్షులు దత్తత కోసం ప్రజలకు అవగాహాన కల్పిస్తు, ఇప్పిటికేఅరుదైనరకాల పక్షుల సంరక్షణను జూపార్కులో సమర్థవంతంగా నిర్వహిస్తున్నా మని, కనుమరగవుతున్న వందల జాతుల పక్షుల మనుగడ రక్షణ కోసం పక్షీ ప్రేమికుల్లాగా కృషిచేద్దామని ఆమె పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News