Friday, October 3, 2025
ePaper
Homeక్రైమ్ వార్తలుఏసీబీ వలలో నార్సింగి టౌన్ ప్లానింగ్ అధికారి

ఏసీబీ వలలో నార్సింగి టౌన్ ప్లానింగ్ అధికారి

నార్సింగి మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక లంచం తీసుకుంటూ ఏసీబీ బృందానికి చిక్కారు. మంచిరేవుల ప్రాంతంలో ఉన్న రాధ రియల్టర్ వెంచర్లో ఒక ప్లాట్‌కు ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) క్లియరెన్స్ ఇవ్వాలంటే 10 లక్షల రూపాయలు ఆమె డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఫిర్యాదుదారుడు వినోద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారు పథకం ప్రకారం ఆపరేషన్ నిర్వహించారు. వినోద్ ఇచ్చిన 4 లక్షల రూపాయలు స్వీకరిస్తుండగా, మణిహారికను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారులు కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News