Tuesday, February 10, 2026
Homeహైదరాబాద్‌Arrest | పాత నేరస్తుడిని అరెస్టు

Arrest | పాత నేరస్తుడిని అరెస్టు

  • 80 గ్రాముల బంగారం, 300 గ్రామల వెండి స్వాధీనం చేసుకున్న నాగోల్ పోలీసులు

ఇంటి తాళాలు పగలగొట్టి రాత్రివేళల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడు అగు మండే విజయ్‌కుమార్‌ను నాగోల్ పోలీసులు అరెస్టు చేశారు. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌరేళ్లి గ్రామం, శ్రీ రుద్ర బృందావన్ కాలనీలో నివాసం ఉంటున్న డాక్టర్ నంద కిషోర్ ఇంట్లో జనవరిలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు విజయవంతంగా చేధించారు.

ఈ ఘటనలో బాధితుడు డాక్టర్ నంద కిషోర్ ఇంట్లో లేని సమయంలో ఇంటి తాళం పగలగొట్టి బంగారు, వెండి ఆభరణాలు, విలువైన వస్తువులు చోరీ చేసినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుడి వద్ద నుంచి చోరీకి సంబంధించిన సొత్తును రికవర్ చేసినట్లు నాగోల్ పోలీస్ స్టేషన్ సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ వెల్లడించారు.

- Advertisement -

సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ అందించిన సమాచారం వరకు వివరాలు ఇలా ఉన్నాయి.

నిందితుడు విజయ్‌కుమార్ చర్లపల్లి జైలులో పరిచయం అయిన మరో పాత నేరస్తుడు డెరింగుల హరిబాబుతో కలిసి మేడ్చల్, పఠాన్‌చేరు, కీసర, మేడిపల్లి, నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రివేళల్లో ఇంటి తాళాలు పగలగొట్టి వరుస దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించినట్లు తెలిపారు. నిందితుడి నుంచి 8 తులాల బంగారం, మూడు గ్రాముల వెండి, 8 చేతి గడియారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు.

అరెస్టు అనంతరం నిందితుడిని సోమవారం కోర్టులో హాజరుపరిచి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు జైలుకు తరలించినట్లు సీఐ తెలిపారు. ఈ కేస్. ను చెందించడం లొ కృషి చేసిన ఎస్ఐ. శివ నాగ ప్రసాద్, హేడ్ కాన్స్టేబుల్ శంషాద్దీన్, క్రైమ్ కాన్స్టేబుల్ సుభాష్, సాయిష్ ను సీఐ అభినందించారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News