Wednesday, February 18, 2026
Homeఆంధ్రప్రదేశ్Nagababu | చిరు వ్యాపారస్తులను భయపెట్టకండి..

Nagababu | చిరు వ్యాపారస్తులను భయపెట్టకండి..

  • సూచించిన ఎమ్మెల్సీ నాగబాబు..

చిరు వ్యాపారస్తులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కె. నాగబాబు స్పష్టం చేశారు. పొట్టకూటి కోసం చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారిని భయభ్రాంతులకు గురిచేయడం సరైనది కాదన్నారు. ఇటీవల కోవా బన్ను అమ్ముకుంటున్న ఒక చిరు వ్యాపారిపై జరిగిన ఘటన తర్వాత, అతను శివరాత్రి రోజున కూడా వ్యాపారం చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేయడంతో.. వ్యక్తిగతంగా రూ.25 వేల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు.

చిరు వ్యాపారులు విక్రయించే ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించడానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారని, ఎలాంటి అనుమానాలు ఉన్నా చట్టపరంగా అధికారులను సంప్రదించాలని ఎమ్మెల్సీ కె. నాగబాబు సూచించారు. వలి వంటి చిరు వ్యాపారులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

- Advertisement -

ఇదే సమయంలో ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా ఈ దాడిని ఖండిస్తూ ప్రకటనలు విడుదల చేయడం అభినందనీయమన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News