Sunday, May 10, 2026
HomeసినిమాMutton | "మటన్" మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్

Mutton | “మటన్” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్

”పుష్ప” ఫేమ్ జగదీష్ ప్రతాప్ బండారి లీడ్ రోల్ లో నటిస్తున్న మూవీ “మటన్”. ఈ చిత్రాన్ని డైస్ ఆర్ట్ ఫిలిమ్స్ బ్యానర్‌పై యువ దర్శకుడు హర్షా డైస్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతున్న “మటన్” మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి పెట్టిన ‘రక్తం.. రణం.. ప్రతీకారం..’ అనే ట్యాగ్‌లైన్ ఆసక్తిని పెంచుతోంది. ఈ రోజు ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.

జగదీష్ ప్రతాప్ బండారి రా అండ్ రస్టిక్ లుక్ తో “మటన్” మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఆయన లుక్ ఇంటెన్స్ గా కనిపిస్తోంది. మోషన్ పోస్టర్ లో ‘ఆకలితో మొదలయ్యే ఆట, రక్తంతో ముగుస్తుంది…’ అనే క్యాప్షన్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రంలో జగదీష్ ప్రతాప్ బండారి పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు.

- Advertisement -

“మటన్” సినిమా అనౌన్స్ మెంట్ నుంచే అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. తెలుగు నుంచి మరో క్రేజీ పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం నిలవనుందని మేకర్స్ నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.

టీమ్ – మనస్వి, రాజేష్ కన్నా,రమేష్ మాదాసు, క్రాంతి సంజయ్, కిరీటి రాజ్ ముస్సి, రవివర్మ ఉప్పలపాటి, తనాయ్ దేవునూరి, శ్రీనాథ్, నాగదీపక్ తదితరులు.

సాంకేతిక నిపుణులు
————————–
బ్యానర్ : డైస్ ఆర్ట్ ఫిలిమ్స్
నిర్మాత, దర్శకత్వం : హర్షా డైస్
పి ఆర్.ఓ : హరీష్ అప్పారా

- Advertisement -
RELATED ARTICLES

Latest News